E-Paper
Advertisement

సౌదీలో రూటు మార్చిన హూతీలు.. రియాద్‌లో భారీ భవనాలు టార్గెట్, పీఐఎఫ్ టవర్‌పై క్షిపణుల దాడి

సౌదీలో రూటు మార్చిన హూతీలు.. రియాద్‌లో భారీ భవనాలు టార్గెట్, పీఐఎఫ్ టవర్‌పై క్షిపణుల దాడి
Advertisement

Saudi Arabia: గల్ఫ్‌లో పరిస్థితులు శాంతించలేదా? నిన్నటివరకు ఇరాన్ వంతు కాగా, ఇప్పుడు హౌతీల వంతు మొదలైందా? సౌదీపై పదే పదే క్షిపణుల దాడులు చేస్తోందా? తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై దాడులు తీవ్రతరం చేసింది. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ టవర్‌పై క్షిపణులతో దాడులు చేశాయి. దీంతో ఆ భవనం  ఘోరంగా దెబ్బతింది. దీనికి సంబంధించి దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

రియాద్‌లో భారీ భవనాలు టార్గెట్

సౌదీ అరేబియా రాజధాని రియోద్‌లో భారీ బహుళ భవనంపై క్షిపణులతో దాడులు చేశాయి హౌతీలు. రియోద్ సిటీలో అత్యంత ఎత్తైన 80 అంతస్తుల పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ టవర్‌ డ్యామేజ్ అయ్యింది. భవనంలో ముఖ్యభాగం దెబ్బతినగా, కిటికీలు పేలిపోయాయి. 385 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ టవర్.. సౌదీ అరేబియా ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం. ఈ దాడి ఫలితంగా టవర్‌లోని పలు అంతస్తులు, పక్కనే ఉన్న రెండు భవనాలకు ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సౌదీ పాలకులు తెలిపారు.

పీఐఎఫ్ టవర్‌పై క్షిపణులతో హౌతీలు  దాడి

Advertisement

పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ ఉన్న భవనం గాజు బాహ్య భాగానికి నష్టం జరిగినట్లు కనిపించే ఫోటోను విడుదల చేసింది. ఈనెలలో రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ భవనాల టవర్ దెబ్బతినడం ఇది రెండోసారి. అంతకుముందు చమురు దిగ్గజం అరామ్కోకు చెందిన ఓ టవర్ డ్యామేజ్ అయ్యింది. ఆకాశహర్మ్యాలు, విలాసవంతమైన దుకాణాలు, పచ్చని ప్రదేశాలతో పాటు ఈ జిల్లాలో గోల్డ్‌మన్ సాక్స్ వంటి బహుళజాతి సంస్థలతోపాటు సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన కార్యాలయం ఉంది.

ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడకుండా భారీ భవనాలు నిర్మిస్తోంది. అందులో ప్రపంచస్థాయి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవలి యుద్ధాల వల్ల ఈ ప్రణాళికలకు ముప్పు వాటిల్లింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి రియాద్‌ వైపు హూతీలు ప్రయోగించిన ఓ క్షిపణిని కూల్చివేశామని సౌదీ మిలిటరీ ప్రకటన విడుదల చేసింది. హౌతీలతో పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి.. రియాద్ వైపు ఉగ్రవాద హౌతీ మిలీషియా ప్రయోగించిన క్షిపణి ముప్పును తాము ఎదుర్కొన్నామని తెలిపింది.

Advertisement

ALSO READ: రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!

సెప్టెంబర్ ఆరంభం నుంచి భవనంలోని చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారట. ఈ దాడుల నేపథ్యంలో సౌదీఅరేబియాకు వెళ్లే విమాన సర్వీసులను నవంబర్ 30 వరకు రద్దు చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్. యెమెన్ సరిహద్దునున్న సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతం వైపు వచ్చిన ఐదు బాలిస్టిక్ క్షిపణులను సంకీర్ణ దళాలు అడ్డుకున్నాయని మల్కీ గురువారం తెలిపారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఇటీవలికాలంగా సౌదీ అరేబియాపై తమ దాడులను తీవ్రతరం చేశాయి. విమానాశ్రయాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలు, రియాద్ ఆర్థిక కేంద్రంతో సహా పలు లక్ష్యాలపై వారు దాడులు చేస్తున్న విషయం తెల్సిందే.

 

 

Related News

రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మాజీ చీఫ్ యూనస్ ఇంటికి దుండగుల నిప్పు, భారీగా బలగాలు మోహరింపు

అమెరికా డ్రీమ్‌కు బ్రేక్.. గ్రీన్‌కార్డు రూల్స్ మరింత కఠినం! భారతీయుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు!

మాజీ ప్రధాని హసీనా స్వదేశానికి! ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుళ్లు, పలువురికి గాయాలు

ట్రంప్ ప్రభుత్వానికి షాక్‌ల మీద షాక్.. విద్యార్థులు, జర్నలిస్టులకు బిగ్ రిలీఫ్, న్యాయస్థానం కీలక ఆదేశాలు

హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. పేలిన మూడు చమురు నౌకలు, ఇరాన్ ప్రకటన

పెను ప్రమాదం.. 5 అంతస్తుల భారీ నౌకను ఢీకొట్టిన ట్యాంకర్.. నీటిలో బోల్తాపడ్డ క్రూయిజ్!

Big Stories

Advertisement
×