E-Paper
Advertisement

రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!

రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!
Advertisement

Rohingya Genocide: రోహింగ్యా మైనారిటీలపై మయన్మార్ మారణహోమానికి పాల్పడిందని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) గురువారం చారిత్రక తీర్పు ఇచ్చింది. నిర్వాసితులైన శరణార్థులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి రప్పించాలని ఆదేశించడంతో పాటు, వారికి పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానమైన ఐసీజే.. తన 80 ఏళ్ల చరిత్రలో ఒక దేశం మారణహోమానికి పాల్పడిందని నిర్ధారించడం ఇదే తొలిసారి. 2017లో మయన్మార్ సైన్యం చేతిలో దారుణ అణచివేతకు గురైన రోహింగ్యా బాధితులకు ఈ తీర్పుతో ఊరట లభించినట్లైంది.

నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) అధ్యక్షుడు యుజి ఇవాసావా తుది తీర్పుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ‘ఉత్తర రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యా సమూహంపై రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ (Republic of the Union of Myanma) మారణహోమానికి పాల్పడింది’ అని తేల్చారు. సుమారు 3 గంటల పాటు సాగిన ప్రసంగంలో రోహింగ్యాలపై మయన్మార్ సాగించిన దమనకాండకు సంబంధించిన కఠిన సాక్ష్యాలను వివరించారు. ఈ హింస కారణంగా లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయారన్నారు.

Advertisement

అంతేకాకుండా వేలాది మంది రోహింగ్యా పౌరులను మయన్మార్ భద్రతా దళాలు హతమార్చాయని అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొంది. మహిళలను వివస్త్రలను చేసి లైంగిక దాడికి పాల్పడ్డాయని, వారి పిల్లలను అత్యంత క్రూరంగా హింసించారని ఇవాసావా పేర్కొన్నారు. రోహింగ్యా గ్రామాలను ధ్వంసం చేసి వాటి స్థానంలో రోహింగ్యేతరులను నివాసం ఉంచారని కోర్టు తెలిపింది. ఆ జాతిని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే మయన్మార్ వ్యవహరించినట్లుగా నిర్ధారణ అయినట్లు కోర్టు తీర్పునిచ్చింది.

Also Read: జియోలో ఈ ప్లాన్ గురించి తెలుసా? 300GB డేటా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్.. లిస్ట్ చాలా పెద్దదే బాస్!

Advertisement

నిరాశ్రయులైన రోహింగ్యాలు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సురక్షితమైన వాతావరణాన్ని మయన్మార్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు ఈ మారణహోమంలో ఎవరి పాత్ర ఉన్నా విచారించి కఠినంగా శిక్షించాలని నిర్ణయించినట్లు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని భవిష్యత్తులో నిర్ణయిస్తామని తెలిపారు. కాగా ఐసీజే తీర్పు చట్టబద్ధమైనదే అయినప్పటికీ.. దాన్ని నేరుగా అమలు చేసే అధికారం న్యాయస్థానానికి లేదు. ఈ నేపథ్యంలో మయన్మార్ అధినేత మిన్ ఆంగ్ హ్లైంగ్‌పై ఈ తీర్పును అమలు చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే దీనిని కచ్చితంగా అమలు చేసేలా మయన్మార్ పై ఒత్తిడి తేవాలని ఐసీజే భావిస్తోంది.

Also Read: ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది.. పూర్వం ఎల్ నినోను ఎలా ఎదుర్కొనేవారు? ఎలా బతికి బట్టకట్టేవారో తెలుసా?

Tags

Related News

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మాజీ చీఫ్ యూనస్ ఇంటికి దుండగుల నిప్పు, భారీగా బలగాలు మోహరింపు

అమెరికా డ్రీమ్‌కు బ్రేక్.. గ్రీన్‌కార్డు రూల్స్ మరింత కఠినం! భారతీయుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు!

మాజీ ప్రధాని హసీనా స్వదేశానికి! ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుళ్లు, పలువురికి గాయాలు

ట్రంప్ ప్రభుత్వానికి షాక్‌ల మీద షాక్.. విద్యార్థులు, జర్నలిస్టులకు బిగ్ రిలీఫ్, న్యాయస్థానం కీలక ఆదేశాలు

హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. పేలిన మూడు చమురు నౌకలు, ఇరాన్ ప్రకటన

పెను ప్రమాదం.. 5 అంతస్తుల భారీ నౌకను ఢీకొట్టిన ట్యాంకర్.. నీటిలో బోల్తాపడ్డ క్రూయిజ్!

అమెరికాలో తీవ్ర గందరగోళం.. ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన వేలాది విమానాలు.. ప్రయాణికుల నరకయాతన!

Big Stories

Advertisement
×