Big Stories

Students Died : ఉసురు తీస్తున్న విదేశీ విద్య

Students Died

Students Died : ఉన్నత చదువులే లక్ష్యంగా విదేశాలకు వెళ్లిన 400 మందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ కారణాల మృత్యువాత పడ్డారు. సహజ కారణాలతో పాటు మెడికల్ కాంప్లికేషన్స్, యాక్సిడెంట్స్ వల్ల ఈ మరణాలు సంభవించాయి.

- Advertisement -

త ఐదేళ్లలో 403 మంది విద్యార్థులు మరణించారని కేంద్రమంత్రి వి.మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు. 34 దేశాల్లో ఈ మరణాలు చోటుచేసుకోగా.. అత్యధికంగా కెనడాలో నమోదయ్యాయి. ఒక్క కెనడాలోనే 91 మంది భారతీయ విద్యార్థులు చనిపోయారు.

- Advertisement -

బ్రిటన్(48 మంది), రష్యా(40), అమెరికా(36), ఆస్ట్రేలియా(35), ఉక్రెయిన్(21), జర్మనీ(20), సైప్రస్(14), ఇటలీ(10), ఫిలిప్పీన్స్(10) దేశాల్లో భారతీయ విద్యార్థులు ఆకస్మిక మరణానికి గురయ్యారు.

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మురళీధరన్ చెప్పారు. ఆత్మహత్య లేదా డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోనే 47 మంది విదేశీ విద్యార్థులు గత రెండేళ్లలో మృతి చెందారు.

ఆర్థికపరమైన ఒత్తిళ్ల కారణంగా అత్యధికులు బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కెనడాలో టాప్ యూనివర్సిటీల్లో చదవాలంటే అధిక వ్యయం తప్పదు. అండర్ గ్రాడ్యుయేట్లు వార్షిక ఫీజుగా 6464 డాలర్లు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే 36,100 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

అక్కడి యూనివర్సిటీల ఆదాయంలో 68% విదేశీ విద్యార్థుల నుంచే సమకూరుతుందని అంచనా. నానాటికీ పెరుగుతున్న జీవనవ్యయం తోడు కావడంతో ఖర్చు తడిసిమోపెడవుతోంది. దీంతో చట్ట నిబంధనలకు తిలోదకాలిస్తూ రెండు ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. అదీ అతి తక్కువ వేతనంతో. కొలువు దొరికితే సరి.. లేకుంటే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం తప్పదు.

పరోక్షంగా దీని వల్ల మానసిక ఒత్తిడి పెరిగి బలవన్మరణానికి పాల్పడుతున్న సంఘటనలు లేకపోలేదు. ఒక్కొక్కరు వారానికి 70 గంటల వరకు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతోంది. ఆ ఒత్తిడిని జయించలేక మృత్యుపరిష్వంగంలోకి జారుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News