BigTV English

Protein Rich Foods: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ప్రోటీన్ లోపం ఉందని అర్థం, వీటిని తినండి

Protein Rich Foods: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ప్రోటీన్ లోపం ఉందని అర్థం, వీటిని తినండి

Protein Rich Foods: ప్రోటీన్ లోపం వల్ల అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రోటీన్ లోపం అనేది తీవ్రమైనదిగానే భావించాలి. ఎందుకంటే మన ఆహారంలో ఎక్కువగా ఉండాల్సింది ప్రోటీనే. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటివి మన శరీరానికి ఎంతో ముఖ్యమైనది. పోషకాల సమతుల్యత తగ్గితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మొదలైపోతాయి. మీలో ప్రోటీన్ లోపం ఉంటే కొన్ని రకాల లక్షణాల ద్వారా శరీరం మీకు ఆ విషయాన్ని చెబుతుంది. ప్రోటీన్ లాభం వల్ల ఎలాంటి రోగాల బారిన పడకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినడం మంచిది.


ప్రోటీన్ లోపం వల్ల చర్మంలో వాపు కనిపిస్తుంది. దీన్ని ఎడెమా అని కూడా పిలుస్తారు. చేతులు, కాళ్లల్లో వాపు ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు. ప్రోటీన్ లోపం వల్ల నీరు చేరిందని అర్థం. శరీర కణజాలంలో ద్రవం చేరడం ప్రారంభమవ్వడానికి ప్రోటీన్ లోపం కూడా కారణమే. అల్బుమిన్ అనే ప్రోటీన్ రక్తంలో కనిపిస్తుంది. ప్రోటీన్ లోపిస్తే దీని పనితీరు మారిపోతుంది. దీనివల్ల పాదాలు, మోకాలు, చేతుల్లో నీరు చేరి వాచినట్టు అవుతాయి.

ప్రోటీన్ లోపం వల్ల కాలేయంలో కొవ్వు చేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇది తీవ్రమైన సమస్యగా మారిపోతుంది. ప్రోటీన్ల లోపం వల్ల పేగుల్లో ఉండే బ్యాక్టీరియా, లైపో ప్రోటీన్లు సరిగ్గా పనిచేయవు. అప్పుడు కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది తీవ్రమైన సమస్యగా మారిపోయే అవకాశం ఉంది.


Also Read: మిరియాలా మజాకా.. వీటితో ఎన్ని సమస్యలు పరార్ అవుతాయో తెలుసా

చర్మం, జుట్టు, గోళ్ళల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రోటీన్ లోపిస్తే జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. విపరీతంగా ఊడిపోతుంది. ఆకృతి కూడా దెబ్బతింటుంది. చర్మం పొడిబారిపోతుంది. చర్మంపై మచ్చలు వంటివి కనిపిస్తాయి. గోళ్లు కూడా తెల్లగా మారిపోతాయి.

ప్రోటీన్ లేకపోతే ఎముకలు బలహీనంగా అయిపోతాయి. విరిగిపోయే ప్రమాదం కూడా ఎక్కువే. మీ ఎముకలు బలహీనంగా అనిపిస్తున్నా, బరువులు ఎత్తలేకపోతున్నా మీకు ప్రోటీన్ లోపం ఉందని అర్థం చేసుకోండి.

మీకు అధికంగా ఆకలి వేస్తున్నా కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ఇది ప్రోటీన్ లోపాన్ని సూచిస్తుంది. మీరు తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తింటే శరీరం ఆ ప్రోటీన్‌ను ఇతర అవసరాలకు నిల్వ చేస్తుంది. అలాగే మిమ్మల్ని ఎక్కువ తినమని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల మీకు తరచూ ఆకలి వేస్తూ ఉంటుంది. అలా ఎక్కువగా తిని ఊబకాయం బారిన పడే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ప్రోటీన్ లోపించడం వల్ల పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉండే అన్నం, బంగాళదుంపలు వంటివి ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఆ రెండూ కూడా ఎక్కువగా తినడం వల్ల బరువు త్వరగా పెరిగే అవకాశం ఉంది.

ప్రోటీన్ వీటిలో అధికంగా ఉంటుంది

రొయ్యలు, టూనా, చేపలు, సాల్మన్ చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. గుడ్లు, బాదం పప్పు, చికెన్, చీజ్, పాలు, పప్పులు, పెరుగు, క్వినోవా, గుమ్మడి గింజలు, వేరుశనగపప్పు వంటి వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. ప్రోటీన్ లోపాన్ని త్వరగా అధిగమించవచ్చు.

 

Related News

Shrunken Heads: తలలు నరికి, పుర్రెపై చర్మాన్ని ఒలిచి.. చనిపోయేవాళ్లను ఇక్కడ ఇలాగే చేస్తారు, ఎందుకంటే?

Weight Loss: బరువు తగ్గాలా ? అయితే రాత్రిపూట ఇవి అస్సలు తినొద్దు !

Kidney Health: వీటికి దూరంగా ఉంటేనే.. మీ కిడ్నీలు సేఫ్

Fatty Liver Disease: మహిళలకు ఫ్యాటీ లివర్ ముప్పు.. ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు

Multani Mitti: ముల్తానీ మిట్టి ఇలా వాడితే.. ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు !

Mental Health: మానసిక ఆరోగ్యం కోసం ఏం తినాలి ?

Big Stories

×