BigTV English

Minnesota Dam Collapsed: అమెరికాలో పోటెత్తిన వరద.. తెగిన మిన్నెసోటా డ్యామ్‌..!

Minnesota Dam Collapsed: అమెరికాలో పోటెత్తిన వరద.. తెగిన మిన్నెసోటా డ్యామ్‌..!

Minnesota Dam Collapsed in America due to Floods: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా డ్యామ్ తెగి జనావాసాల్లోకి నీరు చేరింది. అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు వరదలతో విలవిల్లాడుతున్నాయి. ఐయోవా సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిన్నెసోటాలోని బ్లూ ఎర్త్ కైంటీలో ది ర్యాపిడాన్ డ్యామ్ వరద తీవ్రతకు తెగిపోయింది. దీంతో అధికారులు  సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగ డ్యామ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ మిన్నెసోటా ప్రాంతం ఇప్పటికీ వరదల్లోనే ఉంది.


ఐయోవా వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 11 వేల మంది నివసిస్తున్న సెన్సర్ పట్టణం, క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అధికారులు 383 మందిని వరదల నుంచి కాపాడారు. సియోక్స్ నగర నీటి ప్రవాహం కారణంగా సమీపంలోని రైల్ రోడ్ వంతెన కుప్పకూలింది. అయితే 1993లో వచ్చిన భయానక వరదలను ప్రస్తుత పరిస్థితి గుర్తు చెస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ఇక్కడ ప్రధాన వ్యాపారాలు మొత్తం మూతపడ్డాయి. ఆసుప్రతులు కూడా ఖాళీ చేయించారు. ఇక వారం మొదట్లో నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వరద నీరు మొత్తం మిస్సోరీ, మిసిస్సిప్పీ నదిలోకి చేరనుంది.

Also Read: పాకిస్తాన్‌లో కాంగో వైరస్ కలకలం.. వణుకుతున్న దక్షిణాసియా దేశాలు


కుండపోత వర్షాలు:
సియోక్స్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసాయి. ఇక్కడి విమానాశ్రయ ప్రాంతంలో భారీ వర్షాపాతం నమోదైంది. ఇక ఐయోవాలోని రాక్ ర్యాపిడ్స్ ప్రాంతంలో 11 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో నేల పూర్తిగా తేమతో నిండిపోయి నీరు ఇంకని పరిస్థితి ఏర్పడింది.

Related News

Elon Musk: ప్రపంచంలోనే అత్యధిక జీతం.. మస్క్ మామకు టెస్లా భారీ ఆఫర్.. వామ్మో, అన్ని లక్షల కోట్లా?

Donald Trump: నా జానే జిగర్ మోదీ! వెనక్కి తగ్గిన ట్రంప్..

Afghan Women: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!

MRI Accident: మెడలో మెటల్ చైన్‌తో ఎంఆర్ఐ గదిలోకి.. క్షణాల్లో ప్రాణం గాలిలోకి.. ఎక్కడంటే?

Donald Trump: భారత్‌తో సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… కుట్రబుద్ధి ఉన్న చైనాతో..?

Putin: 150 ఏళ్లు బతకొచ్చు.. ఎలాగంటే..! పుతిన్ చెప్పిన సీక్రెట్స్..

Big Stories

×