Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో ఏం జరుగుతోంది? టపాసుల మాదిరిగా మైన్స్ పేలుతున్నాయా? వాణిజ్య నౌకలు ఎందుకు మునిగిపోతున్నాయి? వాటిపై ఎవరైనా దాడి చేస్తున్నారా? మైన్స్ పేలి ప్రమాదం సంభవించిందా? ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మాటలు ఒకలా, అంతర్జాతీయ మీడియా మాటలు మరొకలా ఉన్నాయి. అసలు జలసంధిలో ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కీలకమైన హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ మార్గంలో వెళ్తున్న సింగపూర్ రిజిస్ట్రేషన్ కలిగిన రెండు భారీ కంటైనర్ షిప్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ ఘటన గల్ఫ్ రీజియన్లో సంచలనం రేపింది. జీఎఫ్ఎస్ ప్రైడ్ అనే కంటైనర్ నౌక అగ్ని ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిపోయింది. సకాలంలో స్పందించడంతో అందులో 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది. దెబ్బతిన్న మరో నౌక ‘జీఎఫ్ఎస్ గిసెల్ సురక్షిత మరొక ప్రాంతానికి చేరుకుంది.
అందులోని 22 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు తెలిపింది. రెండు నౌకల్లో సింగపూర్ పౌరులు ఎవరూ లేరని వెల్లడించింది. ఓ క్షిపణి దూసుకు వచ్చి హిట్ కొట్టడంతో కంటైనర్ షిప్ సముద్రంలో మునిగిపోయిందని భద్రతా వర్గాలు తెలిపాయి. 2824 ఇరవై అడుగుల గల GFS ప్రైడ్ అనే చిన్న కంటైనర్ నౌక. గడిచిన 10 రోజులుగా జలమార్గం చుట్టూ దాడులు పెరిగిన నేపథ్యంలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రియాక్ట్ అయ్యింది. జలసంధిలో సముద్ర మైన్ను ఢీకొన్న తర్వాత 2500 కంటైనర్లతో వెళ్తన్న సరుకు రవాణా నౌక మునిగిపోయిందని తెలిపింది. మైన్స్ ఢీ కొన్న తర్వాత ఓడలో మంటలు చెలరేగినట్టు తెలిపింది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ల్యాండ్మైన్ను ఢీకొని ఓడ మునిగిపోవడం ఇదే ఫస్ట్ టైమ్. మునిగిపోయిన ఓడను యూఏఈకి చెందిన ఓ కంపెనీ నిర్వహిస్తోంది. హోర్ముజ్ సమీపంలో అనుమతి లేని ప్రమాదకరమైన మార్గం ద్వారా ఆ నౌక ప్రయాణిస్తోందని ఐఆర్జిసి తెలిపింది. తాము నిర్దేశించిన మార్గం నుంచి కాకుండా ఏ నౌక దారి మళ్లినా దాని పర్యవసానాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని గతంలో పలుమార్లు హెచ్చరించింది ఇరాన్. ఈ ఘటన తర్వాత సముద్రంలో తేలుతున్న కంటైనర్లకు దూరంగా, అప్రమత్తంగా ఉండాలని ఐఆర్జిసి స్థానిక నౌకలు, మత్స్యకారులను కోరింది.
ALSO READ: అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు
సముద్రంలో పడిపోయిన కంటైనర్లు.. ఇతర నౌకలకు ముప్పు కలిగించడంతోపాటు సముద్ర రవాణాకు ఆటంకం కలిగించే అవకాశముందని చెబుతోంది. హోర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ను కలుపుతోంది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకటి. దీని ద్వారా ముడి చమురు, సరుకులు రవాణా చేయబడతాయి. ఈ ప్రాంతంలో నౌకాయాన భద్రతపై ఆందోళనలు చాలా కాలంగా ఉన్నాయి.
🚨BREAKING: Iran reportedly claims that a UAE-owned container ship carrying more than 2,500 containers struck a naval mine, exploded and sank in the Strait of Hormuz this morning.
If confirmed, it would mark the first vessel sunk by a naval mine in the war.
Initial reports… pic.twitter.com/EXxk3PfGQb
— Scorpion Intel (@scorpion_intel) October 15, 2026