BigTV English

Alaska Earthquake: అమెరికా అలస్కా తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

Alaska Earthquake: అమెరికా అలస్కా తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

Alaska Earthquake అమెరికాలోని ఉత్తర పశ్చిమ భాగమైన అలాస్కాలో.. మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4:38 గంటల సమయంలో అలాస్కా తీర ప్రాంతంలో.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు భూగర్భ కేంద్రానికి 10 కిలోమీటర్ల లోతులో నమోదు కాగా, పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.


భూకంప కేంద్రం, ప్రభావిత ప్రాంతాలు
భూకంపం ప్రభావంతో యునాలాస్కా, డచ్ హార్బర్, కోడి యాక్ వంటి తీర ప్రాంతాల్లో.. భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా జనాలు బయటకు పరుగులు తీశారు.

సునామీ హెచ్చరికలు
అమెరికన్ నేషనల్ ట్సునామీ వార్నింగ్ సెంటర్ (NTWC) ప్రకారం, భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అలాస్కా, హవాయి, పసిఫిక్ ద్వీప దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి సమీప ప్రాంతాల్లో 3 నుండి 6 అడుగుల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉంది. తీర ప్రాంతాల ప్రజలు అత్యవసరంగా.. భద్రతా ప్రాంతాలకు తరలివెళ్లాలి అని అధికారులు సూచించారు.


అలాస్కాలోని కోడి యాక్ ఐలాండ్, డచ్ హార్బర్, ఇతర తీరప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. అలాగే, ఓరెగన్, వాషింగ్టన్ తీరాల్లో కూడా కోస్తా ప్రాంతాల్లో మరింత ప్రభావం ఉండడంతో.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

అధికారుల స్పందన
అలాస్కా అత్యవసర నిర్వహణ విభాగం (Alaska Emergency Management Agency) వేగంగా స్పందించి, భద్రతా చర్యలు చేపట్టింది. విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ, ప్రజల లోపలికి తిరిగి వెళ్లే ప్రక్రియలు, భవనాల నిర్మాణ సుస్థిరత పరిశీలనలు మొదలయ్యాయి.

భవనాలపై ప్రభావం
అలాస్కాలోని కొన్ని పాత భవనాల్లో లైట్ క్రాక్స్ కనిపించినట్లు నివేదికలు వచ్చాయి. అయితే ప్రాణనష్టం, భారీ ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలిక సెలవు ప్రకటించబడింది.

గత భూకంపాల జ్ఞాపకాలు
అలాస్కా ప్రాంతం గతంలో కూడా భారీ భూకంపాలకు కేరాఫ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 1964లో జరిగిన 9.2 తీవ్రత గల భూకంపం అమెరికా చరిత్రలోనే.. అత్యంత ప్రమాదకరమైన భూకంపంగా నిలిచింది. ఆ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. కాగా గత మూడు రోజుల క్రితం అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రమైన. అలస్కాలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది.

Also Read: చైనాలో తుఫాన్ అల్లకల్లోలం.. 400 భవనాలు ధ్వంసం.. వీడియో వైరల్

భవిష్యత్తుకు సూచనలు
అలాస్కా ప్రజలకు అధికారులు కొన్ని సూచనలు చేశారు:

ఎప్పటికప్పుడు అధికారుల ప్రకటనలను గమనించాలి

అత్యవసర కిట్ (టార్చ్, ఫోన్ బ్యాటరీ, వైద్యపరికరాలు, తాగునీరు) సిద్ధంగా ఉంచుకోవాలి

భవనాల నిర్మాణ ప్రమాణాలు పరిశీలించుకోవాలి

భూకంప సమయంలో ఎలా స్పందించాలి అనే విషయం తెలుసుకోవాలి

Related News

Donald Trump: నా జానే జిగర్ మోదీ! వెనక్కి తగ్గిన ట్రంప్..

Afghan Women: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!

MRI Accident: మెడలో మెటల్ చైన్‌తో ఎంఆర్ఐ గదిలోకి.. క్షణాల్లో ప్రాణం గాలిలోకి.. ఎక్కడంటే?

Donald Trump: భారత్‌తో సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… కుట్రబుద్ధి ఉన్న చైనాతో..?

Putin: 150 ఏళ్లు బతకొచ్చు.. ఎలాగంటే..! పుతిన్ చెప్పిన సీక్రెట్స్..

China Military Parade: ఆ ముగ్గురు కలిస్తే తట్టుకోవడం కష్టమే.. భయంలో ట్రంప్

Big Stories

×