AP Liquor Case: ఏపీ లిక్కర్ కుంభకోణం క్లయిమాక్స్‌కి చేరిందా? ఎంపీ మిథున్‌రెడ్డి నిజాలు చెబితే ఈ కేసుకు ఫుల్‌స్టాప్ పడినట్టేనా? తనను తాను కాపాడుకునేందుకు అప్రూవర్‌గా మారుతారా? అదే జరిగితే నెక్ట్స్ అరెస్టు జగన్ మావయ్యదేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
లిక్కర్ కేసు వైసీపీని ముంచేసింది. ఈ కేసులో దాదాపు అందరూ అరెస్ట్ అయ్యారు. చివరకు లబ్దిదారు మాత్రమే మిగిలివున్నారు. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీటులో అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు పుల్‌స్టాప్‌కు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఈ విషయంలో ఎంపీ మిథున్‌రెడ్డి అప్రూవర్‌గా మారితే వైసీపీ అధినేత జగన్ పని అయిపోయినట్టేనని అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.
మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు మాజీ సీఎం జగన్ అని తేల్చింది సిట్. ముడుపులు ఎవరెవరి నుంచి ఎంతెంత కమీషన్ వచ్చింది, ఎక్కడ చెల్లించారు? ఏయే రూపాల్లో అందాయో న్యాయస్థానానికి సమర్పించిన చార్జిషీటులో బయటపెట్టింది. డిస్టిలరీల నుంచి 20 శాతం వచ్చేలా ఒప్పించారు.
ఆ ముడుపులు కసిరెడ్డి చేతుల నుంచి విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎంపీ మిథున్‌రెడ్డి మీదుగా జగన్ వెళ్లినట్టు తేల్చింది. చివరి ముగ్గురు వ్యక్తులు ఆయా ముడుపులు జగన్‌కు ముట్టజెప్పినట్లు తేల్చింది. ప్రతీ నెలా రూ. 50 నుంచి 60 కోట్లు మావయ్యకు అందినట్టు పేర్కొంది.
ALSO READ: ఏపీ పాలిటిక్స్‌లో కొత్త సీన్.. రాజకీయాలకు రోజా గుడ్ బై?
ఎన్నికల్లో ఖర్చు 250 నుంచి 300 కోట్ల రూపాయలు పంపిణీ చేశారని ప్రస్తావించింది. ఓవరాల్‌గా చూస్తే రూ.3,500 కోట్లు ముడుపుల రూపంలో వసూలు చేసినట్టు సిట్ తేల్చింది. డబ్బులు వివిధ మార్గాల్లో ఎక్కడెక్కడికి వెళ్లాయో తెలిపింది.
వసూలు చేసిన ముడుపులు అగ్రభాగం దుబాయ్‌కి తరలించినట్టు ప్రాథమిక అభియోగపత్రంలో వెల్లడించింది సిట్. ముడుపుల నిధులను తొలుత షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. అక్కడి నుంచి చట్టబద్ధమైన కంపెనీల ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొంది.
ముడుపుల సొమ్ము అంతిమ లబ్ధిదారుకు ఏయే మార్గాల్లో చేరిందో అనేది దర్యాప్తులో తేలనుంది. ఆయా విషయాలపై నిందితుడు మిథున్‌రెడ్డి క్లారిటీ ఇస్తే.. ఈ కేసుకు ఫుల్‌స్టాప్ పడనుంది. ఆ తర్వాత జగన్ మావయ్య వంతని ప్రభుత్వ వర్గాల మాట. అత్యధిక ఆర్డర్లు పొందిన 40 కంపెనీల నుంచి 90 శాతం వరకు అందుకున్నారు.
ఇప్పటి వరకు ఈ కేసులో 48 మందిని నిందితులుగా చేర్చింది సిట్. వారిలో డజను మంది అరెస్టయ్యారు. కీలకమైన మరో 8 మంది విదేశాల్లో ఉన్నారని, వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రస్తావించింది. వారి కోసం రేపో మాపో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించనుంది.
ఈ తతంగమంతా పూర్తి అయ్యేసరికి మరో నాలుగైదు నెలలు పట్టవచ్చని అంటున్నారు. ఈ లెక్కన ఈ ఏడాది బిగ్‌బాస్ అరెస్టు లేనట్టే. వచ్చే ఏడాదిలో అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారు కొందరు నేతలు. జరిగిన.. జరుగుతున్న పరిణామాలను వైసీపీ నేతలు ఆసక్తి గమనిస్తున్నారు.