Big Stories

World Happiness Report: డిప్రెషన్ లో యువత.. వెనుకబడిన అమెరికా.. ఎందుకిలా..?

- Advertisement -

World Happiness Report: యువత డిప్రెషన్ లోకి వెళ్లిపోతోంది. అందుకు అనేక కారణాలున్నాయి. చదువు, ఉద్యోగం, ప్రేమ, భవిష్యత్ ను గురించిన ఆలోచనలు ఇలా అనేకం ఉన్నాయి. తాజాగా గాలప్ రిలీజ్ చేసిన వర్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ (World Happiness Report)లో యువత డిప్రెషన్ లో ఉండిపోయి.. సంతోషాన్ని మరచిపోతుందని, 60 పైబడిన వారే సంతోషంగా జీవిస్తున్నట్లు తేలింది. ఈ నివేదిక ప్రారంభించిన 12 సంవత్సరాల్లో తొలిసారి అమెరికా.. తొలి 20 హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో స్థానాన్ని కోల్పోయింది. ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సహా పలు సమస్యలను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణమని కూడా ఈ రిపోర్టు చెబుతోంది.

- Advertisement -

వివిధ ప్రాంతాలు, వయో వర్గాలలో గత 12 సంవత్సరాలలో గ్లోబల్ హ్యాపీనెస్ అసమానత 20% కంటే ఎక్కువ పెరిగిందని గాలప్ పరిశోధనలో తేలింది. కౌమారదశలో ఉన్నవారు, యువకులలో ఉత్సాహం తగ్గింది. అమెరికాలో యువతతో పోలిస్తే.. 60, అంతకన్నా వయసు పైబడిన వారు ఆనందంగా జీవిస్తున్నట్లు తెలిపారు. యువతకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ తక్కువగా ఉండటం, తమ జీవితంపై తామే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రస్తుత జీవన పరిస్థితిని ప్రభావితం చేస్తున్నట్లు నివేదిక చెబుతోంది. యువత ఎక్కువగా ఒత్తిడికి గురవుతుందని తెలిపింది.

అత్యంత సంతోషంగా ఉన్న దేశాల్లో నార్డిక్ దేశాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. డెన్మార్క్, ఐలాండ్, స్వీడన్, నార్వే దేశాలు టాప్ 10 స్థానాల్లో ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ ప్రకారం.. ఫిన్లాండ్ విద్య, పని-జీవిత సమతుల్యత, పర్యావరణ నాణ్యత, సామాజిక సంబంధాలు, భద్రత, జీవిత సంతృప్తిలో అగ్రస్థానంలో నిలిచింది.

Also Read: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనా ఇంజనీర్లు మృతి

యువత సంతోషాన్ని కోల్పోవడానికి కారణం.. ఉద్యోగాలు లేకపోవడం. ఇటీవల అనేక కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అనేక మందిని తొలగించాయి. మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు దొరకడం కష్టతరంగా మారింది. అమెరికన్లు ఒకేసారి డిగ్రీ పట్టాలతో కాలేజీల నుంచి బయటికొస్తున్న వేళ.. నిరుద్యోగం పెరుగుతోంది. జాబ్ మార్కెట్ లో పోటీ అధికంగా ఉంది. ఒక్కపోస్టుకు వేలల్లో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే.. ద్రవ్యోల్బణం రేటు తగ్గాలి. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి. అప్పుడే యువత కాస్తైనా డిప్రెషన్ నుంచి బయటికొస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News