Big Stories

Suicide Bomb Attack in Pakistan: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనా ఇంజనీర్లు మృతి!

Suicide Bomb Attack

- Advertisement -

5 Chinese Nationals Suicide Bomb Attack in Pakistan: పాకిస్థాన్ లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చైనా జాతీయులు మృతి చెందారు. వీరిలో పాటుగా ఓ స్థానికూడా మరణించాడు. చైనీస్ ఇంజనీర్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై దాడి జరిగింది. దీంతో అందులో ఉన్న వారు అక్కడికక్కడే మరణించారు.

- Advertisement -

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చైనీస్ ఇంజనీర్లు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై దాడి జరిగిన క్రమంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో చైనీయులతో పాటుగా ఓ స్థానికుడు మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఆత్మాహుతి దాడిపై సమాచారం అందిన వెంటనే.. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

ఇస్లామాబాద్ నుంచి దాసులో తమ క్వాంప్ నకు చైనా ఇంజనీర్ల కాన్వాయ్ వెళుతుండగా పేలుడు పదార్థాలు నింపిన వాహనం వారి కాన్వాయ్ ను ఢీకొట్టింది. చైనీస్ కాన్వాయ్ లోయలోకి పడపోయి.. భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కొందరు కాన్వాయ్ నుంచి ప్రాణాలతో బయటపడ్డారని పాక్ పోలీసులు తెలిపారు. అయితే దాసు ప్రాంతంలో గతంలో కూడా చైనా జాతీయులను లక్ష్యంగా చాలా దాడులు జరిగాయి.

Also Read: Bridge Collapse: ఘోర ప్రమాదం.. నౌక ఢీకొని ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన

అయితే ఈ ఆత్మాహుతి దాడి ఘటనను పాకిస్థాన్ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. చైనా జాతీయుల మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాక్ లోని ఎన్ని వ్యతిరేక శక్తులు ఉన్నాసరే పాక్-చైనా మధ్య స్నేహాన్ని దెబ్బతీయలేవని జర్దారీ వెల్లడించారు. ఈ ఆత్మాహుతి దాడికి తమదే బాధ్యత అని ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. దీంతో పాక్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇదే ప్రాంతంలో 2021లో బస్ పై బాంబు దాడి జరగగా.. 9 మంది చైనా జాతీయలతో పాటుగా మరి కొంద మంది పాక్ జాతీయులు మరణించారు. ఇక 2023 ఆగస్ట్ లో పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో చైనా ఇంజనీర్ల కాన్వాయ్ పై సాయుధ రెబెల్స్ దాడి చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News