BigTV English

Musk Didn’t Pay Rent: అయ్యో.. అద్దె కూడా కట్టలేవా మస్క్?

Musk Didn’t Pay Rent: అయ్యో.. అద్దె కూడా కట్టలేవా మస్క్?

Musk Didn’t Pay Rent:ట్విట్టర్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దుర్భరంగా తయారవుతోంది. ఎంతగా అంటే… ఆఫీసుల అద్దె కూడా కట్టలేనంత దీన స్థితి దిశగా సాగుతోంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ హెడ్ క్వార్టర్ ఉన్న భవనం అద్దె చెల్లించకపోవడంతో… దాని యజమాని కోర్టుకెక్కారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని 1355 మార్కెట్‌ స్ట్రీట్‌లో… ఓ పెద్ద భవనంలో 4,60,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆఫీసును ట్విట్టర్ అద్దెకు తీసుకుంది. దీనికి డిసెంబరులో 3.36 మిలియన్‌ డాలర్ల అద్దె, జనవరిలో 3.42 మిలియన్‌ డాలర్ల అద్దె చెల్లించాల్సి ఉంది. కానీ, జనవరి నెలాఖరు వచ్చినా రెంట్ కట్టకపోవడంతో… భవన యాజమాన్యం ‘శ్రీ నైన్‌ మార్కెట్‌ స్క్వేర్‌ ఎల్‌ఎల్‌సీ’… కాలిఫోర్నియా స్టేట్‌ కోర్టులో దావా వేసింది.


ఆఫీస్ అద్దెకు ఇచ్చే ముందు ట్విట్టర్‌ నుంచి భవన యాజమాన్యం 3.6 మిలియన్‌ డాలర్ల ‘లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌’ను పూచీకత్తుగా తీసుకుంది. ఒకవేళ యాజమాన్య బదిలీ జరిగితే… దాన్ని 10 మిలియన్‌ డాలర్లకు పెంచాలని అద్దె ఒప్పందంలో పేర్కొన్నామని… దావాలో తెలిపింది. ట్విట్టర్‌ అద్దె కట్టకపోవడంతో, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ద్వారా డిసెంబరు నెల పూర్తి అద్దెతో పాటు… జనవరి నెలకు సంబంధించిన బకాయిలో కొంత భాగాన్ని బ్యాంకు నుంచి తీసేసుకున్నామని కోర్టుకు తెలిపింది. మిగిలిన అద్దె చెల్లించేలా ట్విట్టర్‌ను ఆదేశించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అలాగే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను కూడా 10 మిలియన్‌ డాలర్లకు పెంచేలా ఆదేశాలివ్వాలని కోరింది. ఈ దావాపై కోర్టు ఇంకా తీర్పు ఇవ్వాల్సి ఉంది.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్ క్వార్టర్ అద్దెనే కాదు… ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న ఆఫీసుల అద్దెలను చెల్లించేందుకు కూడా మస్క్ నిరాకరిస్తున్నాడని చెబుతున్నారు. పాత బకాయిలనూ చెల్లించను పొమ్మని అంటున్నాడని ప్రచారం జరుగుతోంది. సంస్థను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి అనేక ఆదాయ మార్గాలను వెతుకుతున్న మస్క్… రాబడి పూర్తిగా తగ్గిపోవడం వల్లే, అద్దెలు కూడా కట్టలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి, ట్విటర్‌ను మళ్లీ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు… మస్క్ ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో చూడాలి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×