E-Paper
Advertisement

మాజీ ప్రధాని హసీనా స్వదేశానికి! ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుళ్లు, పలువురికి గాయాలు

మాజీ ప్రధాని హసీనా స్వదేశానికి! ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుళ్లు, పలువురికి గాయాలు
Advertisement

Dhaka: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అదే సమయంలో ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో పలుచోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అసలు ఢాకాలో ఏం జరుగుతోంది?

ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుళ్లు, పలువురికి గాయాలు

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోసారి హింస చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది అక్కడి ప్రభుత్వం. అదే సమయంలో ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నాటు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హసీనా తిరిగి స్వదేశానికి వస్తున్నారని తెలియగానే కాస్త ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

రెండేళ్ల నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా. డిసెంబర్‌లో ఆమె స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని హసీనా తొలుత ప్రకటన చేశారు. అప్పటినుంచి బంగ్లాదేశ్‌లో ఆమె మద్దతుదారులు-వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. బ్యాంకులు, బస్సులు తగల బెట్టడంతోపాటు వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

ALSO READ: ట్రంప్ ప్రభుత్వానికి షాక్‌ల మీద షాక్.. విద్యార్థులు, జర్నలిస్టులకు బిగ్ రిలీఫ్, న్యాయస్థానం కీలక ఆదేశాలు

Advertisement

కొన్ని రోజులుగా దాదాపు 50 నాటు బాంబు పేలుళ్ల ఘటనలు నమోదైనట్లు స్థానిక మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. తాజా పరిణామాలతో అప్రమత్తమైన ఢాకా పోలీసులు అలర్ట్ అయ్యారు. విధ్వంసక చర్యలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ఆ పార్టీకి కంచుకోట ఢాకా, గోపాల్‌గంజ్‌తోపాటు వంటి జిల్లాల్లో భారీగా బలగాలు మోహరించాయి. వచ్చేనెల నుంచి అదనపు బలగాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related News

ట్రంప్ ప్రభుత్వానికి షాక్‌ల మీద షాక్.. విద్యార్థులు, జర్నలిస్టులకు బిగ్ రిలీఫ్, న్యాయస్థానం కీలక ఆదేశాలు

హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. పేలిన మూడు చమురు నౌకలు, ఇరాన్ ప్రకటన

పెను ప్రమాదం.. 5 అంతస్తుల భారీ నౌకను ఢీకొట్టిన ట్యాంకర్.. నీటిలో బోల్తాపడ్డ క్రూయిజ్!

అమెరికాలో తీవ్ర గందరగోళం.. ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన వేలాది విమానాలు.. ప్రయాణికుల నరకయాతన!

జెన్సన్ హువాంగ్‌తోపాటు ఐదుగురు.. వివాహేతర సంబంధాల ఉచ్చు, పదవులు కోల్పోయిన సీఈవోలు

జెన్సన్ రాజీనామా చేయలేదు,తప్పించారు! అమెరికా కాంగ్రెస్ ముందు హాజరు, తాత్కాలిక సీఈఓ కొల్లెట్ క్రెస్

బిడ్డకు జన్మనిస్తే 100 కొరడా దెబ్బలు.. ఎక్కడో తెలుసా?

Big Stories

Advertisement
×