Strait of Hormuz: ఇరాన్-అమెరికా మధ్య యద్దం కాస్త సద్దుమణిగినా ఉద్రిక్తత పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయా? చమురు రవాణాకు కేరాఫ్‌గా మారిన హోర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకుంటున్నాయా? తాజాగా మూడు చమురు నౌకలు పేలుళ్ల వెనుక ఏం జరిగింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
గడిచిన నెలరోజులుగా ఇరాన్-అమెరికా మధ్య సాధారణ పరిస్థితులు నెలకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. తాజాగా హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలను ఢీ కొని మూడు చమురు నౌకలకు మంటలు అంటుకున్నాయని వెల్లడించింది ఇరాన్ నౌకాదళం. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
శనివారం ఉదయం తూర్పు హోర్ముజ్ జలసంధిలో చమురు నౌక, ల్యాండ్ మైన్స్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే సాయంత్రం మరో రెండు నౌకలు మందుపాతరలను ఢీ కొన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన రెండు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మందుపాతరలను ఢీకొని పేలిపోయినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చెప్పినట్లు ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ వెల్లడించింది.
కొన్నాళ్లుగా ఈ జలసంధి ద్వారా వెళ్లాలనుకునే కొన్ని దేశాల నౌకలపై ఆంక్షలు విధించింది ఇరాన్. ఆ ఆంక్షలను ఉల్లంఘించడంతో అవి ల్యాండ్ మైన్స్ కు తగిలి పేలిపోతున్నట్లు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గతవారం కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ జలమార్గంపై తన నియంత్రణను స్థాపించుకోవడానికి అమెరికాపై ఒత్తిడి తీసుకురావడానికి ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతోంది.
ALSO READ: పెను ప్రమాదం.. 5 అంతస్తుల భారీ నౌకను ఢీకొట్టిన ట్యాంకర్.. నీటిలో బోల్తాపడ్డ క్రూయిజ్!
జరుగుతున్న పరిణామాలపై నౌకా కంపెనీలు వివిధ దేశాలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన నౌకల పేర్లు, ఏ దేశానికి చెందినవి, సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు ఇరాన్ వెల్లడించలేదు. తమ నిబంధనలు పాటించని నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. జరుగుతున్న వ్యవహారంపై అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.