E-Paper
Advertisement

అమెరికాలో తీవ్ర గందరగోళం.. ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన వేలాది విమానాలు.. ప్రయాణికుల నరకయాతన!

అమెరికాలో తీవ్ర గందరగోళం.. ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన వేలాది విమానాలు.. ప్రయాణికుల నరకయాతన!
Advertisement

US Flight Disruption: అమెరికా వ్యాప్తంగా విమాన సేవలు ఒక్కసారిగా స్తంభించాయి. దాదాపు 11వేల విమానాలు ఎయిర్ పోర్టులోనే నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో అర్దంకాక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయి గంటల కొద్ది పాడిగాపులు కాయాల్సిన పరిస్తితి ఏర్పడింది. అయితే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థలో అంతరాయం కలగడంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాలను నిలిపివేసినట్లు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. విమాన రాకపోకలను తిరిగి పునరుద్దరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కాగా, సెప్టెంబర్ 11, 2001 దాడుల తర్వాత ఇలా జరగడం ఇది రెండోసారి. అయితే దీని వెనుక ఎలాంటి ఉగ్రదాడి, కుట్ర కోణం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆంక్షలను ఎత్తివేసి విమాన రాకపోకలను పునరుద్ధరించారు. ఇదే విషయమై మార్క్‌వేన్ ముల్లిన్ మాట్లాడుతూ ‘ఇది మరో 9/11 వంటి ఘటన కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలు అంటే భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో వివిధ నగరాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తామ బాధలను వెళ్లబుచ్చుతూ వారు పెడుతున్న వీడియోలు.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్టులో జానిస్ లెవెల్లిన్ ప్రయాణికురాలు మాట్లాడుతూ.. తన దయనీయ పరిస్థితిపై కన్నీరు పెట్టుకున్నారు. టొరంటోలో జరగనున్న తన కూతురి పెళ్లికి తాను వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నెవార్క్ ఎయిర్‌పోర్టులో జోస్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ.. విమాన సేవలను నిలిపివేశారని తెలిసినా తనకు టికెట్ విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోస్ అనే ప్రయాణికుడు వాపోయాడు. మరోవైపు లాస్ వేగాస్ ఎయిర్ పోర్టు నుంచి ఓక్లాండ్ కు అత్యవసర పని మీదవెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు.. రోడ్డుమార్గంలో తన గమ్యానికి చేరుకోవాలని తొలుత భావించాడు. అయితే విమానాలు ఆగిపోవడంతో హైవేలన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఆలోచన విరమించుకున్నాడు.

Also Read: ఏపీలో మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. నేడు పెండింగ్ పురపాలికలు.. రేపు తొలి దశ పంచాయతీలకు నామినేషన్లు!

Advertisement

అయితే కాలం చెల్లిన సాంకేతిక వ్యవస్థలపై డేటా భారం ఎక్కువ కావడం వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వెల్లడించారు. వీటి స్థానంలో కొత్త సాంకేతికత ఏర్పాటుకు అవసరమైన నిధులను అమెరికన్ కాంగ్రెస్ మంజూరు చేయాలని ఆరోపించారు. ఇది డెమొక్రాట్లు, రిపబ్లికన్ల సమస్య కాదని.. ప్రతి అమెరికన్ కుటుంబానికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని సీన్ డఫీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Also Read: ‘భారత్ సమ్మిట్’ డే 2.. అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాహుల్.. నేడు సీఎం రేవంత్‌తో కలిసి గిగ్ వర్కర్ల స్కీమ్‌కు శ్రీకారం!

Tags

Related News

జెన్సన్ హువాంగ్‌తోపాటు ఐదుగురు.. వివాహేతర సంబంధాల ఉచ్చు, పదవులు కోల్పోయిన సీఈవోలు

జెన్సన్ రాజీనామా చేయలేదు,తప్పించారు! అమెరికా కాంగ్రెస్ ముందు హాజరు, తాత్కాలిక సీఈఓ కొల్లెట్ క్రెస్

బిడ్డకు జన్మనిస్తే 100 కొరడా దెబ్బలు.. ఎక్కడో తెలుసా?

ఎన్విడియా ఏఐ చిప్స్ వ్యవహారంతో.. ట్రంప్ ఇజ్జత్ గల్లంతు!

ఇరాన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు.. ఫోన్ కాల్‌లో తీవ్ర వాగ్వాదం?

నేపాల్‌లో భారీ భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు, 4.9‌గా నమోదు

ఎన్విడియాలో అల్లకల్లోలం.. ఉద్యోగినితో జెన్సన్‌కు లింకులు, పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు

Big Stories

Advertisement
×