BigTV English

Buzz Aldrin: ముసలోడే కానీ మహానుభావుడు.. 93వ యేట నాలుగో పెళ్లి

Buzz Aldrin: ముసలోడే కానీ మహానుభావుడు.. 93వ యేట నాలుగో పెళ్లి

Buzz Aldrin: అమెరికాకు చెందిన మాజీ ఆస్ట్రోనాట్ బజ్ ఆల్డ్రిన్ 93 ఏళ్ల వయస్సులో నాలుగో పెళ్లి చేసుకున్నాడు. 2023 జనవరి 20న తన 93వ పుట్టిన రోజు సందర్భంగా తన ప్రేయసి డాక్టర్ ఆంకా ఫార్‌ను వివాహమాడాడు. లాస్ ఏంజెల్స్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిగింది.


93 ఏళ్ల వయస్సులో కూడా ఆల్డ్రిన్ టీనేజ్ కుర్రాడిలా ఫొటోలకు ఫోజులిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘93వ పుట్టిన రోజున నా ప్రేయసి ఆంకాతో వివాహం.. టీనేజ్‌లో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నంత ఉత్సాహంగా ఉంది’’ అంటూ ఆల్డ్రిన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆల్డ్రిన్‌ గ‌తంలో మూడుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు.

1969లో అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపైకి మానవ సహిత వ్యోమనౌకను పంపించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకేల్ కొల్లిన్స్‌తో కలిసి బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రుడిపైకి వెళ్లాడు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపిన 19 నిమిషాల తర్వాత ఆల్డ్రిన్ చంద్రుడిపై అడుగు పెట్టాడు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×