BigTV English

Land Slide in Goldmine: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి

Land Slide in Goldmine: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి

Land Slide in Philippines Goldmine: కొండచరియలు విరిగిపడి 54 మంది మృతి చెందిన ఘటన పిలిప్పీన్స్ లో జరిగింది. పిలిప్పీన్స్ లోని డావో ప్రావిన్సు మాకో టౌన్ లో బంగారు గని సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటంతో.. ఇళ్లు, వాహనాలు వాటికింద కూరుకుపోయాయి. గతవారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగితోంది.


Read More: మరో సంచలన దౌత్య విజయం.. మరణశిక్ష రద్దైన ఏడుగురు స్వదేశానికి..

ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతున్నట్లు డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 300 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతున్నా.. భారీ వర్షాలు, బురద కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. మళ్లీ కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో.. సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని తెలిపింది. ఈ ప్రమాదంలో మరో 63 మంది ఆచూకీ ఇంతవరకూ తెలియలేదని, వారిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.


Related News

Musk Vs Ellison: మస్క్ ని మించిన మొనగాడు.. ప్రపంచ నెంబర్-1 కుబేరుడు అతడే

Nepal: నేపాల్‌లో ఇంకా కర్ఫ్యూ.. ఖైదీలపై సైన్యం కాల్పులు, మాజీ ప్రధాని ఇంట్లో నగదు, బంగారం సీజ్?

Donald Trump: ఇజ్రాయెల్, ఖతార్ వార్..! బెడిసికొట్టిన ట్రంప్ డబుల్ గేమ్

Charlie Kirk: అమెరికాలో రాజకీయ హింస.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య, నిందితులెవరు?

Pushpa – Trump: ‘పుష్ప’ తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్.. ఇలా తయారయ్యావేంటి మామ!

Nepal Crisis: నేపాల్ ఆర్మీ వార్నింగ్.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, కొత్త ప్రధాని ఆయనే?

Big Stories

×