Big Stories

Ravichandran Ashwin: అశ్విన్‌కి.. ఇదే ఆఖరి సిరీస్ నిజమేనా..? బుమ్రాపై ప్రశంసలు

Ravichandran Ashwin About Jasprit Bumrah: టీమ్ ఇండియాలో సీనియర్ బౌలర్‌గా పేరున్న రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్‌లో చేరడానికి మరొక్క వికెట్టు దూరంలో ఉన్నాడు. అలాగే మరో మూడు టెస్ట్‌లు ఆడితే 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా అరుదైన ఘనతను సాధిస్తాడు.

- Advertisement -

బహుశా ఈ ఇంగ్లాండ్ టూర్‌లో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లే, 37 ఏళ్ల అశ్విన్‌కి ఆఖరని పలు కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా అశ్విన్ తన పని తాను చేసుకువెళ్లిపోతున్నాడు.

- Advertisement -

ఈ సందర్భంగా ఒక పోస్ట్ పెట్టి, అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. తన ఫేవరెట్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా అని తెలిపాడు. తను ఎలాంటి పిచ్ మీదైనా, అద్భుతంగా బాల్‌ని స్వింగ్ చేయడంలో నిష్ణాతుడని పేర్కొన్నాడు. 

ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, రివర్స్ స్వింగ్ తన మనసులో బాల్‌ని ఎలా వేయాలని అనుకుంటాడో, పిచ్ మీద బాల్ అలాగే ల్యాండ్ చేస్తాడని తెలిపాడు. అంత గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు.

Read More: Under-19 World Cup Final: ఒరేయ్.. బాల్ అటు వెయ్యరా? అండర్ 19లో తెలుగు కుర్రాళ్లు..

ఇంగ్లాండ్ సిరీస్‌లో 14 వికెట్లతో అందరికన్నా టాప్‌లో ఉన్నాడని తెలిపాడు. టెస్ట్ ర్యాంకుల్లో కూడా నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడని తెలిపాడు. హిమాలయాలంత ఎత్తు ఎదిగిన బుమ్రాకు, నేను ఫ్యాన్‌ని అయిపోయానని అశ్విన్ అన్నాడు. టీమ్ ఇండియా ఆటగాళ్లలో ప్రతిభకు కొదవలేదని అన్నాడు. 

ఇక రెండో టెస్ట్‌లో సెంచరీ సాధించి శుభ్‌మన్ గిల్ ఫామ్ లోకి వచ్చాడని, ఇదొక శుభ పరిణామం అని తెలిపాడు. మా అందరిలో టెన్షన్ తగ్గిందని అన్నాడు. ఒకే జట్టులో ఉంటూ ఒకరు వెనుకపడిపోతుంటే, అందరికీ బాధగానే ఉంటుందని అన్నాడు.

రాబోయే మూడు టెస్టుల్లో కూడా విజయం సాధించి, సిరీస్ గెలవడమే లక్ష్యంగా పోరాడతామని తెలిపాడు. అలాగే తన గురించి కూడా మాట్లాడుతూ నాలో కూడా ప్రతిభకు కొదవలేదని అన్నాడు. 

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 6 వికెట్లు తీసిన అశ్విన్ , రెండో టెస్ట్‌కి వచ్చేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ పడలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 3 వికెట్లు తీసి ఊపిరి పీల్చుకున్నాడు.ఈ రెండు టెస్టుల్లో కలిపి మొత్తం 9 వికెట్లు తీశాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News