BigTV English

Social Media Ban AUS : ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై బ్యాన్.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అంటూ కూర్చుంటే ఇక చెల్లదమ్మ!

Social Media Ban AUS : ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై బ్యాన్.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అంటూ కూర్చుంటే ఇక చెల్లదమ్మ!

 Social Media Ban AUS : ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా చిన్నా, పెద్దా అంతా స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి కనిపిస్తున్నారు. చిన్నారులకు చెప్పాల్సిన పెద్దలే ఫోన్లు విడిచి ఉండలేని స్థితిలో.. పిల్లలు మరింతగా మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. అందులోని కంటెట్ ను చూస్తూ గంటలు, రోజుల తరబడి గడిపేస్తున్నారు. దాంతో వారి శారీరక, మానకిస ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుంది అని వైద్యులు ఎంత చెప్పినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. మరోవైపు.. సోషల్ మీడియా కంటెట్ కారణంగా తప్పు దారి పట్టి, చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి సంఖ్యా పెరిగిపోతోంది. 


చిన్నారులపై సోషల్ మీడియా కంటెట్ చూపెడుతున్న చెడు ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం.. సోషల్ మీడియా వినియోగానికి వయసు నియంత్రణ విధించే ప్రయత్నాలను ప్రారంభించింది. అంటే..  ఆస్ట్రేలియాలో ఇకపై.. 16 ఏళ్ల లోపు పిల్లలు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధించేలా నిషేధం విధించనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. హానికర కంటెంట్ ను అడ్డుకోవడంలో సోషల్ మీడియా సంస్థలు విఫలమయ్యాయన్న.. ఆస్ట్రేలియా ప్రధాని, తాము విధించబోయే నిషేధాన్ని అన్ని సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 

భారీ జరిమానాలు విధిస్తాం.. 


పిల్లల భవిష్యత్ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిషేధాన్ని అమలుచేయకపోతే.. ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని హెచ్చరించారు. అందరూ తప్పనిసరిగా పిల్లలను సోషల్ మీడియా వినియోగానికి దూరంగా ఉంచాలని అభ్యర్థించిన ప్రధాని అల్బనీస్.. ఈ నిర్ణయాలు పిల్లల తల్లిదండ్రుల కోసమే అన్నారు. ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా కంటెట్ వారి పిల్లలపై చూపెడుతున్న ప్రభావాన్ని గుర్తించాలని, వారిని చదువులు, ఆటలు, ఇతర వ్యాపకాల వైపు పోత్సహించాలని కోరారు.  

సోషల్ మీడియాలోని కంటెట్ లో ఎక్కువగా అసభ్యతను ప్రోత్సహించేవే ఉన్నాయన్న ఆస్ట్రేలియా ప్రధాని.. అర్థనగ్నంగా ఉన్న యువతల ప్రచార చిత్రాలు, పోస్టులు, వీడియోలు సాధారణం అయ్యాయని ఆందోళ వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెట్ ను చూసే 14 ఏళ్ల కుర్రాడికి ఎలాంటి ఆలోచనలు వస్తాయో.?  ఆలోచించాలని కోరారు. అందుకే.. టీనేజ్ వయసు పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని కోరారు. 

ఏడాది సమయం ఇస్తాం.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో సోషల్ మీడియా వినియోగానికి వయోపరిమితిని నిర్దేశిస్తూ ప్రతిపాదన చేసింది. ఈ చట్టాలను తొలుత రాష్ట్రాల స్థాయిలో ఆమోదం కోసం పంపిన ప్రధాని.. నవంబర్ చివరి నాటికి ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సోషల్ మీడియా సంస్థలకు ఏడాది సమయం ఇస్తామని, ఆ తర్వాత వాటి పనితీరును బట్టి నిర్ణయాలుంటాయని పేర్కొన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×