BigTV English

Sai Pallavi: ఆ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన సాయి పల్లవి.. మరోసారి సోషల్ మీడియాలో రచ్చ

Sai Pallavi: ఆ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన సాయి పల్లవి.. మరోసారి సోషల్ మీడియాలో రచ్చ

Sai Pallavi: సాయి పల్లవి అంటే చాలామంది ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అయినా కూడా తన చుట్టూ ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలు తిరుగుతూనే ఉన్నాయి. మామూలుగా తన సినిమా ప్రమోషన్స్ సమయంలో తప్పా సాయి పల్లవి పెద్దగా బయటికి రాదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండదు. అయినా కూడా మూవీ ప్రమోషన్స్ సమయంలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు చాలామందే ఉన్నారు. ఇటీవల ఒక కాంట్రవర్సీ నుండి బయటికొచ్చిన సాయి పల్లవి.. తాజాగా మరొక కాంట్రవర్సీలో ఇరుక్కుంది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి రచ్చ మొదలయ్యింది.


‘అమరన్’ సక్సెస్

సాయి పల్లవి.. శివకార్తికేయన్‌తో జోడీకడుతూ నటించిన సినిమానే ‘అమరన్’ (Amaran). రాజ్‌కుమార్ పెరియసామి ఈ మూవీని డైరెక్ట్ చేయగా.. దీనికి తమిళంతో పాటు తెలుగులో కూడా విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. కలెక్షన్స్ విషయంలో కూడా ‘అమరన్’ దూసుకుపోతోంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ రూ.200 కోట్ల మార్క్‌ను టచ్ చేసిన ఆశ్చర్యం లేదు. అందుకే ఈ మూవీని ఈ రేంజ్‌లో హిట్ చేసిన తెలుగు ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం హైదరాబాద్‌లో ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. అందులో శివకార్తికేయన్‌తో పాటు సాయి పల్లవి కూడా పాల్గొనగా.. ఆ ఈవెంట్‌లో సాయి పల్లవి మాట్లాడిన మాటల వల్ల ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హర్ట్ అయ్యాయి.


Also Read: ‘కథనార్’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. అనుష్క లుక్ అదిరింది..

అవి బ్లాక్‌బస్టర్ కాదా

‘అమరన్’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న సాయి పల్లవి.. ఈ సినిమా తనకు తమిళంలో మొదటి బ్లాక్‌బస్టర్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పటికే తను తమిళంలో సూర్యతో ‘ఎన్‌జీకే’, ధనుష్‌తో ‘మారి 2’లో నటించింది. ‘అమరన్’ బ్లాక్‌బస్టర్ అయితే మరి ఆ సినిమాలు ఏంటి అని ధనుష్, సూర్య ఫ్యాన్స్ అంటున్నారు. ‘మారి 2’లో సాయి పల్లవి చేసిన ఆనంది పాత్రకు మంచి గుర్తింపు లభించింది. కాకపోతే ఈ రెండు చిత్రాలు మాత్రం యావరేజ్‌గా నిలిచాయి. అయినా కూడా ‘అమరన్’ మాత్రమే బ్లాక్‌బస్టర్ అంటూ సాయి పల్లవి ఇచ్చిన స్టేట్‌మెంట్ సూర్య, ధనుష్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది. ఈ మాటను తను వెనక్కి తీసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యాక్టింగ్ వేరే లెవెల్

‘అమరన్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇందులో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించగా.. ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) కనిపించింది. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి నటన వేరే లెవెల్‌లో ఉందని ప్రేక్షకులు తనను ప్రశంసిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ మూవీని అన్ని భాషల్లో ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం మేకర్స్ అంతా గట్టిగా ప్రమోషన్స్ చేశారు. ప్రమోషన్స్‌తో పాటు కంటెంట్ కూడా నచ్చడంతో ‘అమరన్’ పెద్ద హిట్ అయ్యింది. తాజాగా తెలుగులో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా నితిన్ హాజరయ్యాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×