BigTV English
Advertisement

Baba Vanga Predictions 2024 : భయపెట్టిస్తున్న బాబా వంగ భవిష్యవాణి..

Baba Vanga Predictions 2024 : భయపెట్టిస్తున్న బాబా వంగ భవిష్యవాణి..
baba vanga

Baba Vanga Predictions 2024 : నోస్ట్రడామస్ తో పాటే.. బల్గేరియాకు చెందిన మహిళ బాబా వెంగ భవిష్యవాణిలో కొన్ని కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. అసలు ఈ బాబా వెంగ 2024కు సంబంధించి చాలా భయంకరమైన విషయాలను ఊహించారు. అవి చూస్తే షేక్ అవడం ఖాయం. అసలు 2024కు సంబంధించి ఈ జోస్యాలు నిజమయ్యే ఆస్కారం ఎంత? నోస్ట్రడామస్, బాబా వాంగ చెప్పిన వాటిలో ఎన్ని నిజమయ్యాయి?


నోస్ట్రడామస్ జోస్యాన్ని ప్రపంచం నమ్మడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన గత సంవత్సరాల గురించి చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. దీంతో ఆయన భవిష్యవాణిపై గురి కుదిరి ఎక్కువ మంది చదువుతున్నారు. ఏం జరగబోతోందో ముందే క్యాచ్ చేస్తున్నారు. అసలు నోస్ట్రడామస్ గతంలో చెప్పిన వాటిలో నిజమైనవేంటో, అందులో ముఖ్యమైన ఘట్టాలను ఓసారి చూద్దాం. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణం గురించి చెప్పారు. ఎలిజబెత్ సరిగ్గా 96 సంవత్సరాల వయస్సులో చనిపోతుందని ఊహించాడు. తత్త్వవేత్త లే ప్రొఫెటీస్ పుస్తకంలో కవితల రూపంలో రకరకాల అంచనాలు వేశారు. తర్వాత మారియో రీడింగ్ ఆ కవితలన్నింటినీ వివరిస్తూ నోస్ట్రాడమస్ ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్ అనే పుస్తకాన్ని రాశారు.

ఎలిజబెత్ విషయంలో నోస్ట్రాడమస్ అంచనా అక్షరాలా నిజమైంది. రాణి మరణానికి ముందు నోస్ట్రాడమస్ ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్ అనే పుస్తకం 5 కాపీలు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ రాణి మరణానంతరం పుస్తక అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇందులో ఏదో ఉంది… ప్రపంచ భవిష్యత్ ఎలా ఉండబోతోందన్న విషయాలను చదివే వారు ఎక్కువయ్యారు. 1666లో లండన్‌లో జరిగిన గ్రేట్ ఫైర్, 9/11 టెర్రర్ దాడులు ఇలాంటివి అంచనా వేశారు. ఇవన్నీ అతను చెప్పినట్లే నిజమయ్యాయి.


1555లో ఫ్రెంచ్ తత్వవేత్త, నోస్ట్రాడమస్ తన పుస్తకం లే ప్రొఫెటిస్ లో అనేక అంచనాలు వేశారు. ఈ పుస్తకం 942 కవితల సంకలనంగా ఉంది. దాని ద్వారా భవిష్యత్తులో జరగబోయే వివిధ సంఘటనలను అతను ముందే చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచాన్ని వణికించిన ప్రాణాంతక వైరస్ కరోనా వంటి మహమ్మారి గురించి 500 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ రాశారు. ఇదీ ఫ్రెంచ్ కాలజ్ఞాని చెప్పిన విషయాలు. ఇప్పుడు బల్గేరియన్ లేడీ.. బాబా వాంగ అంచనా వేసిన కాలజ్ఞానం ఎలా ఉందో చూద్దాం. ఆమె అంధురాలు. ఆవిడను నోస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్ అని కూడా పిలుస్తారు. తన ద్వారా వచ్చిన అంచనాల్లో 85 శాతం కరెక్ట్ అని తేలింది. లేడీ నోస్ట్రడామస్ అని కూడా అంటారు. కారణం నోస్ట్రడామస్ మాదిరిగానే చాలా వరకు నిజమయ్యాయి.

బల్గేరియాకు చెందిన బాబా వాంగ 2024 గురించి చాలా ప్రమాదకరమైన, భయంకరమైన అంచనాలు వేశారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బ్యాడ్ న్యూస్ సిగ్నల్ ఇచ్చారు. పుతిన్ ను సొంత దేశానికి చెందిన ఎవరైనా హత్య చేస్తారని బాబా వాంగ జోస్యం చెప్పారు. ఎవరో బయటి వ్యక్తులు కాదని, నమ్ముకున్న వారే అని భవిష్యత్ చెప్పారు. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. పుతిన్ అధ్యక్ష నివాసానికి సమీపంలో గతంలో డ్రోన్ దాడులు కూడా జరిగాయి. అంతే కాదు… ప్రిగోజిన్ విమాన ప్రమాదం, మరణం వంటి అంశాలతో చూస్తే పుతిన్ పరిస్థితి ఏమంత సేఫ్టీగా లేదన్న ప్రచారమే జరుగుతోంది. (స్పాట్)

ఈ ఏడాది ప్రమాదకరమైన ఆయుధాల గురించి బాబా వాంగ ఊహించారు. ఒక పెద్ద దేశం బయో వెపన్స్ ను పరీక్షిస్తుందని జోస్యం చెప్పారు. యూరప్‌లోని వివిధ నగరాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతాయంటున్నారు. అలాగే ప్రపంచంలో పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, దీని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందన్నారు. ఇక ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు ప్రతికూల ప్రభావాలను చూస్తాయని జోస్యం చెప్పారు. భూమి కక్ష్యలో మార్పు ఉంటుందని, ఇది చాలా తక్కువ వ్యవధిలో జరుగుతుందన్నారు. రేడియేషన్ ప్రమాదం కూడా ఉంటుందన్నారు. అటు 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల ప్రమాదం కూడా పెరగనుందన్నారు. అధునాతన హ్యాకర్లు పవర్ గ్రిడ్‌లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వంటి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారని ఊహించారు. దీంతో జాతీయ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడుతుందని బాబా వాంగ అంచనా వేశారు.

బాబా వాంగ ప్రకారం ఈ ఏడాది క్యాన్సర్ ను పూర్తిగా నయమ చేసే చికిత్సలు అందుబాటులోకి వస్తాయన్నారు. అల్జీమర్స్‌తో సహా నయం చేయలేని వ్యాధులకు కొత్త ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అటు ఈ ఏడాది క్వాంటం కంప్యూటింగ్‌లో పెద్ద ఆవిష్కరణ జరుగుతుందని వాంగ అంచనా వేశారు. ఇదే జరిగితే 2024లో AI ఇండస్ట్రీ కూడా స్పీడ్ పెరుగుతుంది.

5079 నాటికి భవిష్యత్తు వరకూ బాబా వాంగ అంచనా వేశారని చెబుతారు. ఆమె ప్రకారం లాంగ్ టర్మ్ అంచనాల్లో కొన్ని కీలకమైన అంశాలున్నాయి. అందులో 2076 నాటికి కమ్యూనిజం మళ్లీ ప్రభావం చూపే దశకు చేరుకుంటుందన్నది ఒకటైతే…. 2304లో టైం ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉందని జోస్యం చెప్పడం మరో కీలకాంశం. ఇక చివరగా 5079లో ప్రపంచం అంతమవుతుందని అంచనా వేశారామె. వాంగ చెప్పిన భవిష్యవాణి 85 శాతం వరకు కరెక్ట్‌గా ఉన్నాయని అంటున్నారు. బాబా వాంగ జీవించి లేకపోయినా తరచుగా ఆమె చెప్పిన అంచనాలు వార్తల్లో నిలుస్తుంటాయి. ఓ రిపోర్టు ప్రకారం బాబా వాంగ తన మరణాన్ని మాత్రమే కాదు 9/11 ఉగ్రదాడుల సహా అనేక సంఘటనలు ఊహించారు. బల్గేరియాకు చెందిన బాబా వాంగ అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. 1996లో 84 సంవత్సరాల వయస్సులో వంగా మరణించారు.

1989 సంవత్సరంలోనే 9/11 దాడుల గురించి ఊహించారు బాగా వాంగ. అమెరికా ఉష్ట్ర పక్షులచే దాడి చేయబడుతుందని అందులో కవలలు పడిపోతారని చెప్పారు. పొదల్లో తోడేళ్లు అరుస్తుంటాయని, అమాయకుల రక్తం కారుతుంటుందని రాసుకున్నారు. స్టీల్ బర్డ్స్ అంటే దాడికి ఉపయోగించిన విమానాలను ఉద్దేశించినవిగా అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ గురించి ఊహించి రాసినవి అన్నీ నిజమవుతాయన్న గ్యారెంటీ ఎక్కడా లేదు. దీన్ని నమ్మడం నమ్మక పోవడం వ్యక్తుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×