BigTV English

Best Food City : రుచులకు ఆ నగరాలే బెస్ట్

Best Food City : రుచులకు ఆ నగరాలే బెస్ట్

Best Food City : బిర్యానీ అనగానే గుర్తొచ్చేది హైదరాబాదే. పూతరేకులకు తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం పెట్టింది పేరు. ఇలా ఒక్కో ప్రాంతం అక్కడ లభ్యమయ్యే స్థానిక రుచులతో ప్రసిద్ధి పొందుతుంది. ప్రపంచంలోనే టేస్టీ టేస్టీ ఫుడ్ దొరికే నగరాలు ఏవో తెలుసా?


బెస్ట్ ఫుడ్ సిటీస్‌గా ఎంపికైన 100 నగరాల్లో ఐదు మన దేశంలోనే ఉండటం గొప్పే. ఆ ఐదు సిటీల్లోనూ హైదరాబాద్‌కు చోటు దక్కడం మరీ గర్వకారణం. ప్రపంచవ్యాప్త రేటింగ్ లో 39వ స్థానంలో నిలిచింది. మన దేశం వరకు చూస్తే రెండో బెస్ట్ ఫుడ్ సిటీ మనదే.

ప్రముఖ ట్రావెల్ ఆన్‌లైన్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల ఈ ర్యాంకింగ్‌లు ప్రకటించింది. ‘బెస్ట్ ఫుడ్ సిటీస్ ఇన్ ది వరల్డ్’ పేరిట వంద నగరాలతో జాబితాను విడుదల చేసింది. మన దేశం నుంచి ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లఖ్‌నవూ నగరాలు బెస్ట్ ఫుడ్ సిటీస్‌గా ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.


టాప్ 50లో ముంబై, హైదరాబాద్ నిలిచాయి. వీటికి 35, 39 ర్యాంక్‌లు దక్కాయి. ఢిల్లీ 56వ ర్యాంక్, చెన్నై 65, లఖ్‌నవూ 95వ ర్యాంక్‌లో నిలిచాయి. ఢిల్లీ, ముంబై చాట్ వెరైటీలకు ప్రసిద్ధి చెందగా..బిర్యానీ టే‌స్ట్‌లో హైదరాబాద్‌కు ఏ నగరమూ సాటిరాదు.

ఇక చెన్నై నోరూరించే దోశెలు, ఇడ్లీల్లో ర్యాంక్ కొట్టేసింది. కబాబ్, బిర్యానీతో కూడిన మొగలాయి వంటకాలకు లఖ్‌నవూ పెట్టింది పేరు. పావ్ బాజి, దోశ, వడ పావ్, చోలె భటూరే, కబాబ్, నిహారి, పానీపురి, చోలే కుల్చి, బిర్యానీ, రకరకాల చాట్స్ వంటి స్థానికంగా లభ్యమయ్యే ఫుడ్స్ అమితాదరణ పొందాయి.

జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం రోమ్ (ఇటలీ). అనేక రుచికరమైన వంటకాలకు ఈ సిటీ ప్రసిద్ధి. రెండు ఇటాలియన్ నగరాలు బోలోగ్నా, నేపుల్స్ వరుసగా 2వ, 3వ ర్యాంక్‌లను సాధించాయి. పాస్తా, పిజ్జా, జున్ను ఆధారిత వంటకాలకు ఇవి ప్రసిద్ధి పొందాయి.

జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర నగరాల్లో వియన్నా (ఆస్ట్రియా), టోక్యో (జపాన్), ఒసాకా (జపాన్), హాంకాంగ్ (చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ), బాండుంగ్ (ఇండోనేషియా), పొజ్నాన్(పోలండ్), శాన్‌ఫ్రాన్సిస్కో(అమెరికా), జెనీవా(స్విట్జర్లాండ్) ఉన్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×