BigTV English
Advertisement

New Year Celebrations : వీళ్ల న్యూఇయర్ వేడుకలు చాలా ప్రత్యేకం..!

New Year Celebrations : వీళ్ల న్యూఇయర్ వేడుకలు చాలా ప్రత్యేకం..!
New Year Celebrations

New Year Celebrations : మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం మొదలుకానుంది. నూతన సంవత్సరం అంటేనే నూతనోత్సాహం, నూతన లక్ష్యాలు, మాటల్లో చెప్పలేని సరికొత్త ఉద్వేగాలు గుర్తుకొస్తాయి. పాత ఏడాది చేదు అనుభవాలను మరిచి, కొత్త విశ్వాసంతో, సరికొత్త ఆకాంక్షలతో న్యూ ఇయర్‌ను స్వాగతిస్తూ చేసుకునే వేడుకలు.. ఒక్కో దేశంలో ఒక్కోలా జరగుతాయి. వీటిని గురించి తెలుసుకున్నప్పుడు అవి మూఢ నమ్మకాలుగా అనిపించినా.. అవి వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అలాంటి కొన్ని నమ్మకాల మీద ఓ లుక్కేద్దాం.


స్పెయిన్‌లో డిసెంబరు 31 రాత్రి సమయం సరిగ్గా 12 వేళకి ఒక గడియారం, 12 ద్రాక్షపండ్లు రెడీగా పెట్టుకుని కూర్చుంటారు. వీటిలో ఒక్కో పండు ఒక్కో నెలకు సంకేతం. అర్థరాత్రి కాగానే .. 12 సార్లు గంటలు మోగుతాయి. ఈ 12 గంటలు ముగిసేలోపు ప్లేటులోని 12 ద్రాక్ష పండ్లు తినేస్తారు. పొరబాటున ఒక్క పండు చేజారినా, టైంలోపు తినలేకపోయినా.. కొత్త ఏడాదిలో తమకు తిప్పలేనని వారు నమ్ముతారు. కాగా.. ఇలా తినటం వల్ల తమకు కొత్త ఏడాదిలో అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు.

స్కాట్‌లాండ్ వాసులు డిసెంబరు 31 అర్థరాత్రి వేళకు.. తమ ఇంటికి వచ్చిన తొలి అతిథి లక్షణాలను బట్టి వచ్చే ఏడాది ఫలితాలుంటాయని నమ్ముతారు. ఆ అతిథి పురుషుడై, బాగా న‌ల్ల జుట్టు ఉంటే శుభాలు జరుగుతాయని, పలుచని జుట్టున్న పురుషుడు లేదా మహిళలు అతిథులుగా వస్తే.. తమకు కష్టాలు తప్పవని వీరి నమ్మకం.


డెన్మార్క్‌ ప్రజలు నూతన సంవత్సర ఆరంభ సయమానికి.. ఇంట్లోని పింగాణీ ప్లేట్లు, గిన్నెలను కర్రలతో మోగిస్తారు. ఇలా కొట్టే క్రమంలో అవన్నీ పగిలి, ఎన్ని ముక్కలైతే కొత్త ఏడాది అంత అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం.

గ్రీసులో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తయారయ్యే ‘వాసిలోపిటా’ అనే కేక్‌లో ఒక నాణాన్ని కనిపించకుండా పెట్టేస్తారు. తర్వాత దానిని కట్ చేసి అందరికీ పంచి తినమంటారు. ఎవరి స్లైస్‌లో నాణం వస్తుందో వారికి కొత్త ఏడాది బాగా కలిసొస్తుందని నమ్ముతారు.

న్యూ ఇయర్ అంటేనే పాతకి బైబై చెప్పి కొత్తని ఆహ్వానించడం అనే భావనను ప్రతిబింబిస్తూ.. డిసెంబరు 31 రాత్రి 12 గంటలకు.. దక్షిణ ఆఫ్రికా దేశీయులు తమ ఇంట్లో పనికిరాకుండా ఉన్న వస్తువులు, ఫర్నిచర్‌ను కిటికీల నుంచి రోడ్డు మీదికి విసిరేస్తారు.

కొత్త ఏడాది వేళ గుండ్రని ఆకారంలో ఉన్న దుస్తులు, వస్తువులు, ఆహారాలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని ఫిలిప్పీన్ ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆ సమయానికి వారంతా గుండ్రని చుక్కలున్న దుస్తులు, గుండ్రని కేకులు, పండ్లను తింటారు.

రష్యాలో డిసెంబరు 31 అర్థరాత్రివేళ.. ఒక కాగితంపై న్యూ ఇయర్ విషెస్ రాసి.. దానిని కాల్చి ఆ పొడిని షాంపైన్‌లో కలుపుకుని తాగుతారు. దీనివల్ల నెగెటివ్ ప్రభావాలు పోయి.. కొత్త ఏడాదిలో మంచి ఫలితాలొస్తాయని వారు నమ్ముతారు.

అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద అర్ధరాత్రి 12 గంటలకు టైమ్ బాల్‌ని కిందకు వదులుతారు. బాణాసంచా, సంగీత వాయిద్యాల హోరులో జరిగే ఈ వేడుకను ‘బాల్ డ్రాప్’ అంటారు. అలా వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది.

జపాన్‌లో డిసెంబరు 31 అర్ధరాత్రి 12 కాగానే.. ప్రజలంతా బౌద్ధ దేవాలయాల వద్దకు చేరి..జోయో నా కానే అనే మంత్రాన్ని జ‌పిస్తూ.. 108 సార్లు గంటలు మోగిస్తారు. దీనివల్ల తమ పాపాలు తొలగి, కొత్త ఏడాదిలో సానుకూలత చేకూరుతుందని వారి నమ్మకం.

బ్రెజిల్‌లో అయితే ప్రజలు తెలుపు రంగులు బట్టలు ధరించి, సముద్రం ఒడ్డుకు చేరుకుంటారు. తమ సముద్ర దేవత అయిన యెమాంజకు నైవేద్యంగా సముద్రంలోకి పువ్వులను విసిరి పాటలు పాడతారు.

ఈక్వెడార్ దేశంలో కొత్త ఏడాది వేడుకలకు గుర్తుగా.. అర్థరాత్రి వేళ.. అక్కడి రాజకీయ నాయకులు, పాప్ గాయకుల దిష్టి బొమ్మలను తగల బెడతారు. ఆ దిష్టి బొమ్మలను వారి భాషలో ఏనోస్ వైజోస్ (పాత ఏడాది) అని అంటారు. దీనివల్ల చెడుపోయి.. మంచి జరుగుతుందని వారి విశ్వాసం.

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×