E-Paper
Advertisement

Best Tourist Places : జాలీగా వెళ్లి చూసి రాదగిన దేశాలివే…!

Best Tourist Places : జాలీగా వెళ్లి చూసి రాదగిన దేశాలివే…!
Advertisement
Best Tourist Places

Best Tourist Places : అనుకున్నదే తడవుగా టూర్‌‌కి వెళ్లగలిగిన దేశాలూ కొన్ని ఉన్నాయని చాలామందికి తెలియదు. కేవలం పర్యాటకం మీదనే ఆధారపడే ఈ దేశాలకు యాత్రికులు ఎప్పుడుకావాలంటే అప్పుడు బయలుదేరొచ్చు. వీసా గట్రా అంటూ పెద్ద ప్రశ్నలుండవు. హాయిగా కోరినన్ని రోజులుండే వెసులుబాటూ ఉంది గనుక నచ్చినంతకాలం ఉండిపోవచ్చు. ఆ దేశాలు, అక్కడి ముచ్చట్లు ఇవే..

ఎల్ సల్వడార్ : ఎత్తైన ప్రదేశాల్లో ఇండ్లు, అడుగడుగునా జలపాతాలు, పచ్చని పొలాలుండే ఈ దేశంలో వీసా లేకుండా 90 రోజులు ఉండవచ్చు.

Advertisement

సెయింట్ లూసియా : అగ్నిపర్వత బీచ్‌లు, కలప శిల్పాలు, ప్రశాంత వాతావరణానికి పేరైన ఈ దేశంలో దిగగానే 42 రోజుల వీసా ఇస్తారు. కోరితే మళ్లీ పొడిగిస్తారు.

మడగాస్కర్ : ఒక భారీ ద్వీపం ఇది. ఇక్కడ అనేక జంతు జాతులు ఉన్నాయి. వెళ్లగానే 3 నెలల గడువుతో వీసా ఇస్తారు.

Advertisement

సమో : పగడపు దీవుల మడుగులు, అగ్ని పర్వత శిఖలు, లావా క్షేత్రాల దేశమిది. వీసా లేకుండా 30 రోజులు ఉండవచ్చు.

శ్రీలంక : ఈ బుల్లిదేశం పచ్చని ప్రకృతికి పెట్టింది పేరు. సముద్ర తీర ప్రాంతాలు, దట్టమైన అడవులంటే ఇష్టపడేవారు చూసితీరాల్సిన దేశం. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అనే పద్ధతిలో ఈ దేశంలోకి అనుమతిస్తారు. గడువు 30 రోజులు ఉంటుంది.

టాంజానియా : అన్ని రకాల జంతు జాతులున్న అరుదైన దేశం. సఫారీలపై ప్రయాణిస్తూ వన్యప్రాణులను దగ్గగరగా చూడొచ్చు. ఇక్కడ దిగగానే గడువులేని వీసా ఇచ్చేస్తారు.

కంబోడియా : పురాతన బౌద్ధ ఆలయాలు, కోటలు, రాజప్రాసాదాలున్న అరుదైన దేశం. ఇక్కడికి వెళ్లిన తర్వాత 30 రోజుల గడువుతో వీసా ఇస్తారు.

నేపాల్ : ఈ హిమాలయ దేశం ప్రకృతి అందాలకు నెలవు. టిబెటన్ ఆరామాలు, ప్రాచీన ఆలయాలున్న ఈ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు జస్ట్.. ఇక్కడి ఓటరు కార్డు చూపిస్తే చాలు. మన రూపాయి కూడా అక్కడ చెల్లుతుంది.

భూటాన్ : కడిగిన ముత్యంలాంటి ఈ దేశం సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది. కాలుష్యం అంటే ఏమిటో తెలియని ఈ దేశ ప్రజల కట్టు, బొట్టు అన్నీ ప్రత్యేకమే. ఇక్కడకు వెళ్లాలంటే వీసా అక్కర్లేదు. గడువు కూడా లేదు. నియమాలే కాస్త కఠినంగా ఉంటాయి.

మాల్దీవులు : మత్స్య పరిశ్రమ, సముద్ర ఉత్పత్తులపై ఆధారపడిన దక్షిణ హిందూమహాసముద్ర దేశం ఇది. నేరుగా వెళ్లాక.. 90 రోజుల గడువున్న వీసా ఇస్తారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×