BigTV English

Canada | కెనడా వెళ్లేందుకు ఇష్టపడని భారతీయ విద్యార్థులు.. కారణం ఇదేనా?

Canada | భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా మద్దతు తెలపడంతో ఆ దేశానికి కష్టాలు మొదలయ్యాయి. కెనెడాలో ఉన్నత విద్యకోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. కెనడా అధికారిక రిపోర్టు ప్రకారం 2023 సంవత్సరంలో భారత్, కెనడా మధ్య రాజకీయ వివాదం కారణంగానే ఈ తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు.

Canada | కెనడా వెళ్లేందుకు ఇష్టపడని భారతీయ విద్యార్థులు.. కారణం ఇదేనా?

Canada | భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు తెలుపుతున్న కెనడా దేశానికి కష్టాలు మొదలయ్యాయి. కెనెడాలో ఉన్నత విద్యకోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. కెనడా అధికారిక రిపోర్టు ప్రకారం 2023 సంవత్సరంలో భారత్, కెనడా మధ్య రాజకీయ వివాదం కారణంగానే ఈ తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు.


రియూటర్స్ వార్తా సంస్థ ఇంటర్‌వ్యూలో కెనడా విద్యాశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులుకు జారీ చేసే స్టడీ పర్మిట్ సంఖ్య బాగా తగ్గిపోయింది. దీనికి ముఖ్యకారణం భారత ప్రభుత్వం స్టడీ పర్మిట్లు జారీ చేసే కెనెడా అధికారులను ఇండియాలోని భారత ఎంబసీ నుంచి తొలగించింది.పైగా కెనడాలో ఖలిస్తానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా కూడా భారతీయ విద్యార్థులు కెనడాలో చదువుకునేందుకు ఇష్టపడడం లేదు.” అని అన్నారు.

కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ మార్క మిల్లర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. కెనడాలో చదువుకునేందుకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిపోయిందని.. ఈ సంఖ్య పెరిగే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదని అన్నారు. దీనికి కారణం భారత దేశంతో కెనడా సంబంధాలలో రాజకీయ ఒత్తిడి పెరగడమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో జూన్ 2023లో భారత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెనడా పౌరుడైన ఖలిస్తానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత గూఢాచారులున్నట్లు ఆధారాలున్నాయని కెనెడా ప్రధాని వెల్లడించారు.

దీంతో భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ కారణంగానే అక్టోబర్ 2023లో ఇండియాలో పనిచేసే కెనడా అధికారులో 41 మందిని తిరిగి వారి దేశానికి పంపించేసింది. ఈ వివాదం చేతనే విదేశాల్లో చదువుకోవాలనే భారతీయ విద్యర్థులు ఇప్పుడు కెనడాకి బదులుగా ఇతర దేశాలకు వెళుతున్నారు.

భారత కెనడా వివాదం కారణంగా గత మూడు నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ కెనడా స్టడీ పర్మిట్ల సంఖ్యలో 86 శాతం తగ్గుదల కనిపించిందని అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంద. 2023 మూడో త్రైమాసికంలో ఈ సంఖ్య 1,08,940 ఉంటే.. నాలుగో త్రైమాసికంలో ఈ సంఖ్య తగ్గిపోయి 14,910 కు చేరింది.

ప్రపంచ వ్యాప్తం నుంచి కెనడాలో చదువుకునేందుకు వస్తున్న విదేశీ విద్యార్థులతో కెనడా దేశానికి ప్రతి సంవత్సరం 22 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కెనడా విద్యా సంస్థలకు పెద్ద నష్టమే.

అయితే కెనడా ప్రభుత్వం మాత్రం తమ దేశంలో చదువుకునేందుకు వచ్చే వారి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని.. దాని వల్ల అందరికీ వెసులుబాటు కల్పించలేకపోతున్నామని చెబుతూ.. విద్యార్థుల సంఖ్య తగ్గడం కొంతవరకూ మంచిదేనని అంటోంది.

కెనడాలో చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు.. ఆ దేశంలోనే ఉద్యోగం చేసుకునేందుకు కెనడా ప్రభుత్వం వారికి వర్క్ పర్మిట్ సులభంగానే ఇస్తుంది. ఈ కారణంగానే విదేశీ విద్యార్థులు కెనడా వెళ్లేందుకు ఇష్టపడతారు.

Related News

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

Big Stories

×