BigTV English

ChatGPT: చాట్‌జీపీటీ.. మొండి బకాయి వసూల్.. ఇక మనమూ వాడుకోవచ్చు..

ChatGPT: చాట్‌జీపీటీ.. మొండి బకాయి వసూల్.. ఇక మనమూ వాడుకోవచ్చు..

ChatGPT: కొందరు ఉంటారు.. వాళ్ల పని అయ్యే వరకు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఎంతటికైనా దిగజారుతారు. ఒక్కసారి పని కంప్లీట్ అయిందా.. ఇక అంతే సంగతి. చేసిన వారి ముఖం కూడా చూడరు. ఏడ పోతే మాకేంటి అనుకుంటారు. అమెరికాకు చెందిన ఓ బ్రాండ్ కంపెనీ కూడా ఇలానే అనుకుంది. పని చేయించుకొని లక్షల రూపాయలు ఎగ్గొట్టింది. వాళ్లు ఎంత తిరిగినా పట్టించుకోలే.. ఏం చేస్తారులే అనుకుంది. అటువంటి మొండి కంపెనీకి గట్టి షాక్ ఇచ్చిది చాట్‌జీపీటీ. క్షణాల్లో డబ్బులు చెల్లించేలా చేసింది.


అసలేం జరిగిందంటే..

అమెరికాకు చెందిన లేట్ చెక్‌అవుట్ అనే డిజైన్ కంపెనీ ఓ బ్రాండ్‌ డిజైన్ కంపెనీకి పనులు చేసి పెట్టింది. ఆ పనికి రూ. 1,09,500 డాలర్లు(మన కరెన్సీలో సుమారు రూ.90 లక్షలు) బ్రాండ్ డిజైన్ కంపెనీ లేట్ చెక్‌అవుట్ కంపెనీకి చెల్లించాల్సి ఉంది. కానీ ఆ కంపెనీ చెల్లించలేదు. మొండికేసింది. పలుమార్లు తిప్పించుకుంది. రేపూ.. మాపూ.. అంటూ సాకులు చెప్పింది. దీంతో ఉద్యోగులు ఏం చేయాలో అర్థి కానీ పరిస్థితిలో ఉండగా చెక్‌అవుట్ కంపెనీ సీఈవో గ్రెగ్ ఐసెన్‌బర్గ్ రంగంలోకి దిగాడు.


ముందుగా లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించాలని అనుకున్నాడు. దానికి సుమారు 1000 డార్ల వరకు ఖర్చు అవుతుందని మానుకున్నాడు. అంతలోనే అతడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే టెక్ ప్రపంచంలో సంచనలం రేపుతున్న చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. తన కంపెనీ పరిస్థితిని అంతా దానికి వివరించాడు. క్లయింట్‌ను భయపెడుతూ ఓ డ్రాఫ్ట్ రాసివ్వమని చాట్‌జీపీటీని కోరాడు.

దీంతో క్షణాల్లో ఓ డ్రాఫ్ట్‌ను రాసి ఇచ్చింది చాట్‌జీపీటీ. దానిలో కొన్ని మార్పుల చేర్పులు చేసి గ్రిగ్ తన క్లయింట్‌కు మెయిల్ పంపించాడు. అంతే రెండు నిమిషాల్లో అవతలి నుంచి రెస్పాన్స్ వచ్చింది. వెంటనే చెల్లిస్తామని క్లయింట్ మెయిల్ చేశాడు. ఈ విషయాన్నంతా వివరిస్తూ గ్రెగ్ ట్వీట్ చేశాడు. చాట్‌జీపీటీకి ధన్యవాదాలు తెలిపాడు. చాట్‌జీపీటీ వల్లే మొండి బకాయిలను వసూల్ చేసుకోగలిగానని పేర్కొన్నాడు.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×