BigTV English

China: చంద్రుడిపై ల్యాండ్ అయిన వ్యోమ నౌక.. రోబో సాయంతో మట్టి నమూనాల సేకరణ

China: చంద్రుడిపై ల్యాండ్ అయిన వ్యోమ నౌక.. రోబో సాయంతో మట్టి నమూనాల సేకరణ

China Moon Landing Mission: చైనాకు చెందిన లూనార్ ల్యాండర్ చాంగే -6 చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అత్యంత అరుదైన ప్రాంతంలో నమూనాలను సేకరించడం మానవ చరిత్రలోనే తొలిసారి అని చైనా వెల్లడించింది. కొయెచావ్-2 రిలే ఉపగ్రహం సాయంతో ల్యాండర్ దిగినట్లు వెల్లడించింది.


చైనా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం అయిట్కిన్ బేసిన్ పేరుతో పిలుచుకునే ప్రాంతంలో చాంగే – 6 ల్యాండ్ అయినట్లు తెలిపింది. రెండు పద్దతుల్లో ల్యూనార్ ప్రోబ్ నమూనాలను సేకరిస్తుంది. డ్రిల్లింగ్ చేసి నేలలో నమూనాలను సేకరించడం ఒక పద్దతి కాగా.. రెండోది రోబో చేయి ఉపరితంలపై ఉన్న మట్టిని సేకరించడం అని పేర్కొంది. అంతే కాకుండా అక్కడికక్కడే మట్టి నమూనా విశ్లేషణ జరుగుతుందని వివరించింది. తద్వారా చంద్రుడి చరిత్రను తెలుసుకోనున్నట్లు వెల్లడించింది.

Also Read: 44 మందికి మరణ శిక్ష విధించిన యెమన్‌ కోర్టు.. ఎందుకంటే..


చాంగే – 6 అక్కడి శాంపిల్స్ తీసుకున్న తర్వాత తిరిగి భూమిపైకి బయల్దేరుతుంది. మే3న భూమి నుంచి బయలు దేరి 53 రోజుల తర్వాత చాంగే- 6 చంద్రుడిని చేరింది. అయితే ఇది రోబోల సహాయంలో చంద్రుడిపై తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టి శాంపిల్స్ తీసుకురానుంది. ఆ తర్వాత లూనార్ ల్యాండర్ లోని అసెండర్ మాడ్యూల్ చంద్రుడిపైకి లేచి చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ తో అనుసంధానం అవుతుంది. మళ్లీ భూమి దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×