BigTV English

China Claims Arunachal Pradesh: సరిహద్దు విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనా.. ఈనెలలో ఇది నాలుగోసారి!

China Claims Arunachal Pradesh: సరిహద్దు విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనా.. ఈనెలలో ఇది నాలుగోసారి!

Arunachal Pradesh


China Claims Arunachal Pradesh: గత కొన్నిరోజులుగా చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మాటలతోనే భారత్ తో ఖయ్యానికి కాలుదువ్వుతోంది. గతంలో కొన్నిసార్లు కవ్వింపు చర్యలు పాల్పడి, భారీగా భద్రతా బలగాలని అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ వద్ద్ మోహరించింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ పై నోరు పారేసుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అన్నాయంగా ఆక్రమించుకొందని చైనా మరోసారి నోరుపారేసుకుంది. ఈ నెలలో చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది నాలుగో సారి గమనార్హం.

ఈనెలలో అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తన జోరు పెంచింది. మాటలతోనే భారత్ తో యుద్ధానికి సిద్ధమంటోంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం అని అక్కడి అధికారులు చేసిన వ్యాఖ్యలను భారత్ తోసి పుచ్చింది. వాటని హాస్యాస్పదమైనవంటూ స్పందించింది. అయినా సరే చైనా తన వైఖరి మార్చుకోకుండా మరిన్ని వ్యాఖ్యలు చేయడంతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా వ్యాఖ్యలకు దీటుగా సమాధానాలు ఇచ్చారు. దీంతో చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ పై వ్యాఖ్యలు చేసింది.


భారత్, చైనాల మధ్య సరిహద్ద వివాదం ఎన్నడూ పరిష్కారం కాలేదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. గతంలో ఆ ప్రాంతం చైనా ఆధీనంలో ఉండేదని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది.. 1987లో భారత్ ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్ గా రూపొందించుకుందని ఘాటు విమర్శలు చేశారు. అది తమ భూభాగం అయినందునే తాము ఇటువంటి ప్రకటనలు చేస్తున్నామని అన్నారు.

Also Read: Japan vs North Korea: చర్చలకు సిద్ధమైన జపాన్.. ఆ విషయంలో తగ్గెదే లే అంటున్న కిమ్..

అయితే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన చేయడంతో చైనా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ పై ఏదో ఒక ప్రకటన చేస్తూనే వస్తోంది. అది తమ దేశంలో భూభాగమేనంటూ వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టింది. గతంలోనూ చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసేది. ఇందులో కొత్త విషయం ఏం లేకపోయినప్పటికీ ఒకే నెలలో నాలుగు సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఏదో పన్నాగం పన్నినట్లు భారత్ భావిస్తోంది.

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా వ్యాఖ్యపై.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన సౌత్ ఏషియన్ స్టేడియంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం అంటూ తోసి పుచ్చారు. దీనికి బదులుగా చైనా మరోసారి స్పందించింది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×