E-Paper
Advertisement

ఒకవైపు నేపాల్లో వందలాది చావులు.. మరోవైపు చోరీ ఘటనలు.. అసలు మనుషులేనా వీళ్లు?

ఒకవైపు నేపాల్లో వందలాది చావులు.. మరోవైపు చోరీ ఘటనలు.. అసలు మనుషులేనా వీళ్లు?
Advertisement

Nepal Floods: నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉప్పెనలా విరుచుకుపడ్డ వరద ధాటికి వందలాది మంది గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున ఇళ్లు, భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ దిగ్భ్రాంతికర పరిస్థితుల్లో అక్కడ విచిత్రమైన చోరీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వరదల్లో కొట్టుకు వచ్చిన లాకర్ ను కొందరు దోచుకోగా.. మృతదేహాలపై బంగారాన్ని మరికొందరు దోచుకుంటున్నారు. ఈ ఘటనలు మానవత్వంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

నదిలో కొట్టుకొచ్చిన సేఫ్ లాకర్ చోరీ

నేపాల్ రసువా (Rasuwa)లోని భోటేకోషి (Bhotekoshi) ప్రాంతంలో సెప్టెంబర్ 10న వచ్చిన వరదల్లో.. ఓ భారీ క్యాష్ సేఫ్ లాకర్ కొట్టుకుపోయింది. ఇది ధాడింగ్ జిల్లా బెల్ఖుఖోలా (Belkhukhola) వద్ద త్రిశూలి నది (Trishuli River) ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే అక్కడి స్థానికులు ఆ సేఫ్ లాకర్‌ను పగలగొట్టి అందులోని నగదును పంచుకున్నట్లు సెప్టెంబర్ 12న పోలీసులకు సమాచారం అందింది.

29 మంది అరెస్ట్.. నగదు స్వాధీనం

Advertisement

సమాచారం అందిన వెంటనే ధాడింగ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చోరీకి పాల్పడిన 29 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద భారతీయ కరెన్సీ రూ.92,68,505 లభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సొమ్ము ఎవరిది? చోరీలో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

మృతదేహం నుంచి బంగారం చోరీ

నేపాల్ లో మరో దిగ్భ్రాంతికర ఘటన సైతం వెలుగు చూసింది. నారాయణి నదిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహం నుండి బంగారు కమ్మలను ఇద్దరు వ్యక్తులు దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వీడియో ఆధారంగా ఇద్దరినీ గుర్తించి అరెస్టు చేశారు. మరోవైపు వరదలో దెబ్బతిన్న ఇళ్లల్లోకి వెళ్లి స్థానికులు చోరీకి పాల్పడుతున్నారు. బాధితులు గల్లంతైన ఇళ్లను టార్గెట్ చేస్తూ.. వాటిలోని వస్తువులు, బంగారం తీసుకెళ్తున్నారు.

Advertisement

కొట్టుకొచ్చిన వస్తువులు సైతం!

ఇదిలా ఉంటే మరో వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. అందులో నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చిన ఇళ్లల్లోని వస్తువులను కొందరు ఎత్తుకెళ్తున్నారు. గ్యాస్ సిలిండర్, గిన్నెలు, ఇతర గృహోపకరణ వస్తువులను బురద నుంచి వెలికి తీసి.. స్థానికులు పట్టుకెళ్తున్నట్లు నేపాల్ మీడియా పేర్కొంది. వందలాది మంది చనిపోయి.. వేలాది మంది గల్లంతైన ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇలా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Also Read: Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!

భారీగా పెరిగిన మృతుల సంఖ్య

మరోవైపు నేపాల్‌లో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 626 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారి సంఖ్య ఒక్కసారిగా 2,426కు పెరిగింది. ఇందులో 517 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.

Also Read: నేపాల్‌లో వరదలు రాబోతున్నట్లు 5 నెలల ముందే తెలుసు.. మానవ తప్పిదమా? నిర్లక్ష్యమా?

Tags

Related News

నేపాల్ ప్రకృతి విపత్తు.. 626కు చేరిన మృతులు.. 2,478 మంది ఆచూకీపై ఆందోళన!

నేపాల్‌లో వరదలు రాబోతున్నట్లు 5 నెలల ముందే తెలుసు.. మానవ తప్పిదమా? నిర్లక్ష్యమా?

మీ సాయం మాకొద్దు.. ఆ ఒక్కటీ చేయండి చాలు.. నేపాల్ స్టేట్మెంట్!

నేపాల్ వరద విపత్తు.. 538కి చేరిన మృతుల సంఖ్య.. 85 మంది భారతీయులు సేఫ్!

నేపాల్‌కు కూతవేటు దూరంలో.. చైనా సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం, తీవ్రత 5 కు పైగానే

మరో 3 రోజుల్లో నేపాల్‌లో మళ్లీ వరదలు.. మీడియాపై ఆంక్షలు విధించిన చైనా.. టిబెట్ ప్రభుత్వం సీరియస్

శవాల గుట్టలు.. శరీర భాగాలు.. పది అంతస్తుల ఎత్తులో బురద ప్రవాహం.. ఎలా ముంచేసిందంటే?

Big Stories

Advertisement
×