E-Paper
Advertisement

మీ సాయం మాకొద్దు.. ఆ ఒక్కటీ చేయండి చాలు.. నేపాల్ స్టేట్మెంట్!

మీ సాయం మాకొద్దు.. ఆ ఒక్కటీ చేయండి చాలు.. నేపాల్ స్టేట్మెంట్!
Advertisement

చరిత్రలో ఎన్నడూలేని విధంగా నేపాల్‌లో భారీ వరద ప్రళయం సృష్టించింది. వందలాది నివాసాలు నేలమట్టం కాగా.. వేల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇప్పటివరకు సుమారు 500 మందికి పైగా మరణించినట్లు నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఇంకా వేలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాతోపాటు పొరుగున ఉన్న చైనా తదితర దేశాలు నేపాల్‌లో సహాయక చర్యలకు ముందుకొచ్చాయి. అయితే, ఈ సాయాన్ని సున్నితంగా తిరస్కరించింది. తమ రెస్క్యూ సిబ్బందితోనే సహాయక చర్యలు చేపడతామని పేర్కొంది.

సాయం ఎందుకు వద్దంది?

ఇతర దేశాల నుంచి సహాయక బృందాలను మాత్రమే నేపాల్ తిరస్కరించింది. దీనికి కారణం.. 2015 సంవత్సరంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలే. అప్పట్లో ఏర్పడిన తీవ్ర భూకంపంలో నేపాల్‌కు సాయం చేసేందుకు వివిధ దేశాల నుంచి రెస్క్యూ టీమ్‌లు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. సమన్వయ లోపం వల్ల సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే ఈ సారి ఇతర దేశాల నుంచి సైనిక, రెస్క్యూ టీమ్‌లను అనుమతించకూడదని నేపాల్ నిర్ణయించుకుంది.

ఆ ఒక్కటి చేయండి చాలు

Advertisement

కేవలం తాము విదేశీ రెస్క్యూ టీమ్‌లను మాత్రం తిరస్కరిస్తున్నామని, సహాయాన్ని కాదని నేపాల్ స్పస్టం చేసింది. విపత్తు మిగిల్చిన విషాదం, నష్టాల నుంచి కోలుకోవడానికి ఆర్థిక సాయం కావాలని కోరింది. అలాగే సహాయక చర్యలకు అవసరమైన సామాగ్రిని నేపాల్‌కు అందివ్వాలని కోరింది. నిధులను సింగిల్ విండో లేదా ప్రధానమంత్రి సహాయ నిధికి మాత్రమే పంపాలని పేర్కొంది. మన దేశం నుంచి ఇప్పటికే 47.5 టన్నుల సహాయక సామాగ్రి నేపాల్‌కు చేరింది. మరో వైపు అమెరికా రూ.4.77 కోట్ల సాయం ప్రకటించింది.

ఏయే దేశం నుంచి ఎంతమంది మిస్సింగ్?

నేపాల్ ప్రభుత్వం సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 538 చనిపోయారు. 1,545 మంది గాయాలతో బయటపడ్డారు. సుమారు వెయ్యి మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వీరిలో 28 మంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. 4,348 మంది పోలీసులతో నేపాల్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న రసువా నుంచి 644 మందిని, నువాకాట్ నుంచి 898 మందిని, ధాడింగ్ నుంచి ముగ్గురిని పోలీసులు రక్షించారు. విపత్తు మొదలైన ప్రాంతం నుంచి సుమారు 200 కిమీల తీర ప్రాంతంలో రెస్క్యూ టీమ్ గాలింపులు జరుపుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను సైతం అప్రమత్తం చేశారు. అయితే, ఇంకోసారి ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Also Read: చైనా జిరాంగ్ పోర్ట్.. చిన్న ఆనవాలు కూడా లేదాయే – ఆ భవనం అక్కడే ఎందుకు కట్టారు?

ఖట్మాండు పోస్ట్ పేర్కొన్న వివరాల ప్రకారం.. 178 భారతీయులు, 65 మంది అమెరికన్లు, 51 మంది ఉక్రెయినన్‌లు, 33 మంది బ్రిటీన్స్, 35 మంది ఆస్ట్రేలియన్లు, 25 మంది కెనడియన్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మరోవైపు చైనాలో కూడా 100 మందికి పైగా పౌరులు వరదలో గల్లంతయ్యారు. వరద ముంచెత్తిన తీర ప్రాంతాల్లో సుమారు 5 నుంచి 6 అడుగుల ఎత్తులో బురద నిండిపోయింది. చాలావరకు ఇళ్లు బురద అడుగునే ఉన్నాయి. ఆ మట్టిని తొలగించడం ఇప్పుడు రెస్క్యూ టీమ్‌లకు పెద్ద సవాలుగా మారింది.

Also Read: నేపాల్ వరద విపత్తు.. 538కి చేరిన మృతుల సంఖ్య.. 85 మంది భారతీయులు సేఫ్!

Tags

Related News

నేపాల్ వరద విపత్తు.. 538కి చేరిన మృతుల సంఖ్య.. 85 మంది భారతీయులు సేఫ్!

నేపాల్‌కు కూతవేటు దూరంలో.. చైనా సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం, తీవ్రత 5 కు పైగానే

మరో 3 రోజుల్లో నేపాల్‌లో మళ్లీ వరదలు.. మీడియాపై ఆంక్షలు విధించిన చైనా.. టిబెట్ ప్రభుత్వం సీరియస్

శవాల గుట్టలు.. శరీర భాగాలు.. పది అంతస్తుల ఎత్తులో బురద ప్రవాహం.. ఎలా ముంచేసిందంటే?

నేపాల్‌లో విధ్వంసం తర్వాత.. భారత్ సరిహద్దులో చైనా భారీ డ్యామ్‌, ‘వాటర్ బాంబ్’ అని ఎందుకంటున్నారు?

స్వర్గం లాంటి దేశంలో.. పదే పదే విపత్తులు ఎందుకు? నేపాల్‌ వినాశనానికి దారితీస్తున్న అంశాలివే!

నేపాల్‌లో జల ప్రళయం.. మానస సరోవర్ యాత్రకు బ్రేక్, యాత్రకు ఎన్ని మార్గాలున్నాయి?

Big Stories

Advertisement
×