Aishwarya Rajesh: ప్రముఖ తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ. గతంలో వెంకటేష్ (Venkatesh ) హీరోగా , అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత ఆమె చేసిన ‘ఓ సుకుమారి’ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ హసిత్ గోలి (Hasith goli) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా నటిస్తున్న ‘దాగుడుమూతల దండాకోర్’ అనే చిత్రంలో హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది.
ఇకపోతే ఇప్పుడు నాగార్జున (Nagarjuna) హీరోగా నటిస్తున్న ఆయన 100వ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్గా నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ కింగ్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున.. తన కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచే 100వ మూవీ దర్శకత్వ బాధ్యతలను ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ (R.A.Karthik) కు ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు తెరకు పరిచయం అవుతూ.. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగు దాదాపు చాలా భాగం కంప్లీట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తాజాగా టైటిల్ గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.
ఇకపోతే గతంలోనే ఐశ్వర్య రాజేష్ కింగ్ 100 మూవీలో మరో హీరోయిన్ గా నటించబోతోంది అంటూ వార్తలు రాగా.. చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇండైరెక్టుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కింగ్ 100 వ మూవీ నుండి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో నాగార్జున చాలా స్టైలిష్ గా , ఎనర్జిటిక్ గా కనిపించారు.. ఈ వీడియోని ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఆమె ఎంట్రీ పై స్పష్టత లభించింది. మొత్తానికి అయితే నాగార్జున 100వ సినిమాలో ఆయనతో కలిసి తెరపై కనిపించబోతుండడం ఐశ్వర్య రాజేష్ కెరియర్ లోనే ఇది చెప్పుకోదగ్గ అవకాశంగా మారింది అంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
also read; బిగ్ బాస్ మహిమ..సంజన గల్రానీలో ఇంత మార్పా.. ట్రోలర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదుగా?
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఐశ్వర్య రాజేష్ .. ఆ తర్వాత వరుస పెట్టి అవకాశాలు అందుకుంటుంది. ముఖ్యంగా తెలుగు , తమిళ్ భాషలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. ఇటీవల సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ సినిమాలో నటించి మంచి పేరు దక్కించుకుంది. ఇప్పుడు నాగార్జున సినిమాలో కూడా అవకాశం అందుకోవడంతో అభిమానులు పూర్తి ఎక్సైజ్మెంట్ అవుతున్నారు . అటు రవితేజ సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. ఏది ఏమైనా సీనియర్ స్టార్ హీరోలతో క్రేజీ అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.