E-Paper
Advertisement

మార్కెట్లో ఎన్నో స్మార్ట్‌వాచ్‌లు ఉన్నా.. శాంసంగ్‌లో మాత్రమే ఉండే 3 ప్రత్యేక ఫీచర్లు!

మార్కెట్లో ఎన్నో స్మార్ట్‌వాచ్‌లు ఉన్నా.. శాంసంగ్‌లో మాత్రమే ఉండే 3 ప్రత్యేక ఫీచర్లు!
Advertisement

Samsung Galaxy Watch: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌వాచ్‌ కేవలం సమయం చూడటానికి మాత్రమే పరిమితం కాలేదు. మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండే ఒక చిన్న సైజ్ హెల్త్ అసిస్టెంట్‌లా మారిపోయింది. మార్కెట్లో యాపిల్, ఇతర రకాల వేర్ ఓఎస్ వాచ్‌లు ఎన్నో అందుబాటులో ఉన్నప్పటికీ.. శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లలో ఉండే కొన్ని హెల్త్ ఫీచర్లు మాత్రం వేరే ఏ బ్రాండ్‌లోనూ కనిపించవు. శాంం‌సంగ్ దాదాపు 13 ఏళ్లుగా ఈ రంగంలో రీసెర్చ్ చేస్తూ తీసుకొచ్చిన ఆ ప్రత్యేకమైన ఫీచర్ల ఏంటో ఇప్పుడు చూద్దాం.

అడ్వాన్స్‌డ్ ఏజీఈస్ (AGEs) ట్రాకింగ్:

Galaxy Watch 7 సిరీస్ నుంచి శాంసంగ్ ఒక కొత్త బయోయాక్టివ్ సెన్సార్‌ను పరిచయం చేసింది. దీని సహాయంతో మన శరీరంలో పేరుకుపోయే ‘అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్’ (AGEs) స్థాయిలను ట్రాక్ చేయవచ్చు. మనం ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే మన జీవక్రియ మందగిస్తుంది. ఈ సెన్సార్ ప్రత్యేకమైన కాంతి కిరణాల ద్వారా మన చర్మాన్ని స్కాన్ చేసి, మన జీవక్రియ ఆరోగ్యం ఎలా ఉందో ఒక అంచనా ఇస్తుంది. ఇది ఒక మెడికల్ పరికరం కాకపోయినా.. మనం తింటున్న ఆహార అలవాట్లను మార్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

Also Read: ఫోన్ వెనుక కలర్ స్క్రీన్.. ఇదేం కొత్త టెక్నాలజీ.. Hisense A10 సిరీస్ వచ్చేసింది!

బాడీ కంపోజిషన్ మెజర్‌మెంట్:

సాధారణంగా జిమ్‌లలో లేదా పెద్ద హాస్పిటల్స్‌లో మాత్రమే ఉండే బాడీ కాంపోజిషన్ మెషిన్ పనితీరును శాంసంగ్ తమ Galaxy Watch 4 నుంచి అందిస్తోంది. దీనిలోని BIA సెన్సార్ శరీరంలోకి చాలా స్వల్ప పరిమాణంలో మైక్రోకరెంట్‌ను పంపిస్తుంది. దీని ద్వారా మన శరీరంలో ఫ్యాట్ ఎంత ఉంది? మజిల్ మాస్ ఎంత ఉంది? అలాగే నీటి శాతం ఎంత ఉందనే వివరాలను సెకన్లలో తెలియజేస్తుంది. మన ఫిట్‌నెస్ ప్రయాణంలో శరీరంలో వస్తున్న మార్పులను గమనించడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది.

యాంటీఆక్సిడెంట్ ఇండెక్స్:

Advertisement

Galaxy Watch 8 సిరీస్‌లో పరిచయం చేసిన మరొక అద్భుతమైన ఫీచర్ ఇది. మన ఆహారంలో పండ్లు, కూరగాయలు సరిపడా తీసుకుంటున్నామా లేదా అనేది ఇది తెలియజేస్తుంది. మనం తినే పండ్లు, కూరగాయలలో ఉండే కెరోటినాయిడ్స్ అనే వర్ణద్రవ్యాలను ఈ వాచ్ చర్మం ద్వారా స్కాన్ చేస్తుంది. దాని ఆధారంగా 0 నుండి 100 వరకు స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్ ఎక్కువగా ఉంటే మనం పోషకాహారం సరిగ్గా తీసుకుంటున్నామని అర్థం. మనం రోజువారీగా పాటించే డైట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఫీచర్ చాలా వినూత్నంగా పనిచేస్తుంది.

Also Read: చిన్న సైజు ఫోన్లకు గుడ్‌బై చెప్పిన యాపిల్.. iPhone Mini ఎందుకు ఆగిపోయింది?

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×