E-Paper
Advertisement

నేపాల్ ప్రకృతి విపత్తు.. 626కు చేరిన మృతులు.. 2,478 మంది ఆచూకీపై ఆందోళన!

నేపాల్ ప్రకృతి విపత్తు.. 626కు చేరిన మృతులు.. 2,478 మంది ఆచూకీపై ఆందోళన!
Advertisement

Nepal Flash Floods: నేపాల్ అకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 626కు చేరింది. ఈ విషయాన్ని నేపాల్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం నేపాల్, టిబెట్ వ్యాప్తంగా 2,478 మంది ఆచూకీ దొరకడం లేదని పేర్కొన్నారు. వీరిలో ఒక్క నేపాల్‌లోనే 1,924 మంది గల్లంతవ్వగా టిబెట్ పరిధిలో 554 మంది జాడ తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో నేపాల్ లోని పరిస్థితులు క్షణ క్షణం ఉత్కంఠగా మారుతున్నాయి.

517 మంది విదేశీయులు మిస్సింగ్

అకస్మిక వరదలు టూరిస్టు ప్రాంతాలను కూడా దెబ్బతీయడంతో పెద్ద సంఖ్యలో విదేశీయులు మిస్ అయ్యారు. నేపాల్ డిజాస్టర్ ఏజెన్సీ సమాచారం ప్రకారం.. పర్యాటకులు, ఇతర దేశాల కార్మికులతో కలిపి సుమారు 517 మంది విదేశీయులు గల్లంతయ్యారు. అటు చైనా భూభాగంలో మరో 260 మంది విదేశీయుల ఆచూకీ లభించాల్సి ఉంది. అటు భారత్ కు చెందిన 300 మందిపైగా పర్యాటకుల అచూకి తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 121 మంది విదేశీ పర్యాటకులను సురక్షితంగా రక్షించినట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది.

స్తంభించిన రవాణా, విద్యుత్ వ్యవస్థలు

Advertisement

మరోవైపు జలప్రళయ ధాటికి ప్రధాన రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి నేపాల్ లో అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. హైడ్రోపావర్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగుతోందని అధికారులు చెబుతున్నారు. వరద ఉధృతికి ఇళ్లు, నివాస ప్రాంతాలు నిమిషాల వ్యవధిలోనే బురదమయంగా మారిపోయాయని గుర్తుచేస్తున్నారు.

మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం

ఇదిలా ఉంటే భోటేకోషి నదీ తీర ప్రాంతంలో నీటిమట్టం మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో మరోసారి వరదలు వచ్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. భోటేకోషి, త్రిశూలి ప్రాంతాల్లోని ప్రజలు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని యంత్రాంగం పిలుపునిచ్చింది.

Advertisement

Also Read: నేపాల్‌లో వరదలు రాబోతున్నట్లు 5 నెలల ముందే తెలుసు.. మానవ తప్పిదమా? నిర్లక్ష్యమా?

నేపాల్‌గా అండగా ఉండండి: ఖర్గే

కష్టాల ఊబిలో కూరుకుపోయిన నేపాల్ కు భారత ప్రభుత్వం అండగా ఉండలాని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సూచించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతు.. వారికి అవసరమైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో నేపాల్ కు అండగా నిలవాలని కోరారు.

Also Read: చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఎక్స్‌పైరీ స్నాక్స్.. కట్ చేస్తే అధికారి నోట్లోనే పెట్టిన స్థానికులు!

Tags

Related News

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

Big Stories

Advertisement
×