E-Paper
Advertisement

ట్రంప్ సర్కార్ కొత్త కసరత్తు.. 90 శాతం భారతీయులపై ప్రభావం, హెచ్-4 ఈఏడీ వర్క్‌పై..

ట్రంప్ సర్కార్ కొత్త కసరత్తు.. 90 శాతం భారతీయులపై ప్రభావం, హెచ్-4 ఈఏడీ వర్క్‌పై..
Advertisement

Trump Govt: వలసదారులపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు స్థానిక అమెరికా వాసులకు మంచిదే. ఉద్యోగాల నిమిత్తం అక్కడికి వెళ్లిన వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ట్రంప్ సర్కార్ ఎప్పుడు ఏలాంటి నిర్ణయాలు తీసుకొస్తుందేమోనని భయంతో బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల భాగస్వాము లకు జారీ చేసే వర్క్ పర్మిట్ హెచ్-4 ఈఏడీను రద్దు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట. దశాబ్ద కాలంగా అమల్లో ఉన్న ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల అమెరికాలో సెటిలైన లక్షలాది భారతీయ కుటుంబాలకు ఇది పిడుగులాంటి వార్త.

 

ట్రంప్ సర్కార్ కొత్త కసరత్తు

Advertisement

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తన 2026 యూనిఫైడ్ ఎజెండాలో RIN 1615-AD14 పేరుతో కొత్త ప్రతిపాదన చేర్చింది. 2015లో ఒబామా హయాంలో తీసుకొచ్చిన నిబంధనను రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని ఆలోచన చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. గతంలో తీసుకొచ్చిన నిబంధన ప్రకారం.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఆమోదం పొందిన (ఫారం I-140) హెచ్-1బీ ఉద్యోగుల భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పని చేసేందుకు అర్హత ఉంది. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే హెచ్-4 వీసాపై ఉన్న భాగస్వాములు తమ తమ ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశముంది. ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న భారతీయ కుటుంబాలపై పెను ప్రభావం చూపనుంది.

హెచ్-1బీ ఉద్యోగుల భాగస్వాములను టార్గెట్ చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ డేటా ప్రకారం.. హెచ్-4 ఈఏడీ ప్రయోజనం పొందుతున్న వారిలో 90 శాతానికి ఉన్నవారు భారతీయులే. అందులో ఎక్కువ మంది మహిళలు. గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ఫ్యామిలీలకు ఆర్థికం, వృత్తిపరంగా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనను దీర్ఘకాలిక చర్యగా పేర్కొంది. ఈ నిబంధనను అమలు చేయడానికి ప్రభుత్వం అధికారికంగా ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రతిపాదనను ప్రచురించాలి. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించాలి. వచ్చిన వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది ఇమిగ్రేషన్ అధికారుల మాట. ప్రస్తుత వర్క్ పర్మిట్లు చెల్లుబాటులో ఉంటాయన్నారు ఇమ్మిగ్రేషన్ అటార్నీ స్వాతిలినా బారిక్.

Advertisement

 

90 శాతం భారతీయుల ఫ్యామిలీపై ప్రభావం

ట్రంప్ ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు లేకపోలేదు. రానున్న నెలరోజుల్లో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఖాళీ అవుతాయంటూ ప్రచారం సాగుతోంది. ఈ వాదనల్లో ఎలాంటి నిజం లేదని, ప్రభుత్వ అధికారిక డేటాలో ఆధారాలు లేవని అక్కడి అధికారులు చెబుతున్నారు. 2024 ఏడాదిలో 1.20.000 వేల హెచ్-4 ఈఏడీ దరఖాస్తులు వచ్చాయి. అందులో భారతీయ పౌరుల వాటా అత్యధికం. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2017లో ఇలాంటి ప్రయత్నం చేశారు. అనుకోని పరిస్థితుల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అలాంటి ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంతో ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ALSO READ: ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తున్న సైబర్ దొంగలు.. రూ.23 కోట్ల విలువగల బిట్‌కాయిన్స్ ఇవ్వాలని బెదిరింపులు

అమెరికాలో H-1B వీసాదారులలో దాదాపు ముప్పావు వంతు మంది భారతీయులున్నారు. H-1B వారిపై ఆధారపడిన వారి పని హక్కులలో ఏ మార్పు వస్తే, అది అక్కడ నివాసం ఉండే భారతీయ కుటుంబాలపై పెను ప్రభావాన్ని చూపవచ్చు. కొత్తగా నియమించుకునే H-1B వీసాదారుల కోసం DHS 103,265 డాలర్ల కొత్త రుసుమును ప్రతిపాదించింది ట్రంప్ సర్కార్. H-1B వీసాదారులు తమ ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేకుంటే అమెరికాను విడిచి వెళ్ళడానికి సమయం ఇచ్చే 60 రోజుల గడువును తొలగించే ప్రతిపాదనకు వైట్ హౌస్ ఆమోదం తెలిపింది.

Related News

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక నిర్ణయం.. డోక్లాం-గాల్వాన్ ఘర్షణల జనరల్‌పై వేటు, ఏం జరిగింది?

ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తున్న సైబర్ దొంగలు.. రూ.23 కోట్ల విలువగల బిట్‌కాయిన్స్ ఇవ్వాలని బెదిరింపులు

ఏంటీ.. నేపాల్ వరద ప్రవాహ వేగం గంటకు 200 కిమీలా? 4 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి..

ఒకవైపు నేపాల్లో వందలాది చావులు.. మరోవైపు చోరీ ఘటనలు.. అసలు మనుషులేనా వీళ్లు?

నేపాల్ ప్రకృతి విపత్తు.. 626కు చేరిన మృతులు.. 2,478 మంది ఆచూకీపై ఆందోళన!

నేపాల్‌లో వరదలు రాబోతున్నట్లు 5 నెలల ముందే తెలుసు.. మానవ తప్పిదమా? నిర్లక్ష్యమా?

మీ సాయం మాకొద్దు.. ఆ ఒక్కటీ చేయండి చాలు.. నేపాల్ స్టేట్మెంట్!

Big Stories

Advertisement
×