Big Stories

Online Delivery Shit | ఆన్ లైన్ డెలివరీలో మలం!.. కస్టమర్ కోపంతో ఏం చేశాడంటే?

Online Delivery Shit | ఈ మధ్య అందరూ ఆన్‌లైన్ షాపింగ్‌కు బాగా అలవాటు పడ్డారు. ఏం కొనాలన్నా ముందు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి యాప్స్‌లో తెగ వెతికేస్తుంటారు. కానీ ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాల కూడా జరుగుతున్నాయి. ఏదైనా ఖరీదైన వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టివిలు, బట్టలు లాంటివి కొన్నప్పుడు పలుమార్లు వేరే వస్తువులు లేదా తక్కువ క్వాలిటీ వస్తువులు డెలివరి జరిగినట్లు చాలాసార్లు తేలింది.

- Advertisement -

కానీ తాజాగా ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో గ్రాసరీ(పప్పు, బియ్యం,) ఆర్డర్ చేశాడు. డెలివరి బాయ్ ప్యాకేజీ ఇచ్చి వెళ్లిపోయాడు. కానీ ప్యాకింగ్ బాక్స్ తెరిచే కొద్దీ దుర్వాసన మొదలైంది. భరించలేక ముక్కు మాస్క్ వేసుకొని ప్యాక్ తెరిచి చూస్తే.. అందులో మలం ఉంది. ఇది చూసిన కస్టమర్‌కు పట్టరాని కోపం వచ్చింది. ఇదేదో ఢిల్లీ బెల్లీ సినిమా సీన్‌లా ఉంది కదా.. కానీ నిజం.. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది.

- Advertisement -

ఇంగ్లాండ్‌లోని స్మిత్ అనే వ్యక్తి ఈ చేదు అనుభం ఎదురైంది. ఆన్‌లైన్ ఆర్డర్‌లో మలం రావడంపై స్మిత్ వెంటనే డెలివరి సంస్థకు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. కానీ వారు పట్టించుకోలేదు. దీంతో అతను ఆ ప్రాంతం ఆరోగ్య అధికారి(హెల్త్ ఇన్ స్పెక్టర్)కి ఫిర్యాదు చేశాడు. హెల్త్ ఇన్ స్పెక్టర్ విచారణ చేసి సంబంధిత సంస్థకు నోటీసులు అందాయి. వెంటనే సంస్థ తరపు అధికారులు ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఇదంతా ఆ డెలివరి బాయ్ చేశాడని తేలింది. డెలివరీ బాయ్‌ని ఉద్యోగం నుంచి తొలగించేశారు. కస్టమర్ స్మిత్‌కు రిఫండ్ చేస్తామని తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News