
Million Dollars : ఒక పట్టణంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలనుకున్న ఇన్ ఫ్లుయెన్సర్ వినూత్న ఆలోచన చేశాడు. ఒక మిలియన్ డాలర్లను (భారత కరెన్సీలో 8 కోట్ల 32 లక్షల 26 వేల 50 రూపాయలు) ఒక కంటైనర్ లో పెట్టి.. ఆ కంటైనర్ ను హెలికాఫ్టర్ కు అటాచ్ చేసి అక్కడి ప్రజలపై డబ్బు వర్షం కురిపించాడు. ఇంతకీ అతనెందుకు అలా చేశాడు. ఎవరతను ? తెలుసుకుందాం.
అతని పేరు కమిల్ బార్టోషేక్. చెక్ రిపబ్లిక్ ఇన్ ఫ్లుయెన్సర్ తో పాటు.. ఒక టీవీ హోస్ట్ కూడా. కమిల్ అనే కంటే కజ్మా అంటే ప్రజలకు అతనెవరో త్వరగా తెలుస్తుంది. ఆ పేరుతోనే అతను ఫేమస్ అయ్యాడు. లైసా నాడ్ లాబెమ్ పట్టణానికి చెందిన ప్రజలకు సహాయం చేయాలనుకున్నాడు. మొదట ఒక పోటీ పెట్టి.. విజేతకు భారీగా బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఈ పోటీలో సైన్ అప్ అయిన పోటీ దారులు.. ట్రెజర్ ను గుర్తించేందుకు వన్ మాన్ షో : ది మూవీ లో ఇచ్చిన కోడ్ ను ఛేదించాలి. అనూహ్యంగా ఆ కోడ్ ను ఎవరూ పరిష్కరించలేకపోయారు. దాంతో కజ్మా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాడు. ఈ గేమ్ లో సైన్ అప్ చేసిన పోటీదారులందరికీ డబ్బును పంచాలని నిర్ణయించుకున్నాడు.
ఆదివారం ఉదయం 6 గంటలకు డబ్బును ఎక్కడ ఇస్తాడన్న విషయాన్ని ఎన్ క్రిప్టెడ్ సమాచారంతో పోటీదారులందరికీ ఈ మెయిల్ పంపించాడు. చెప్పిన సమయం ప్రకారం కంటైనర్ ను హెలికాప్టర్ కు అటాచ్ చేసి నిర్దేశిత ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ కంటైనర్ లో నుంచి మిలియన్ డాలర్లను చల్లాడు. పోటీదారులంతా ఆ డాలర్లను తమవెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకున్నారు. ఈ వీడియోను కజ్మా తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలా చెప్పాడు. “ప్రపంచంలో మొదటి నిజమైన డబ్బు వర్షం! చెక్ రిపబ్లిక్‌లో హెలికాప్టర్ నుండి $1.000.000 పడింది. ఈ క్రమంలో ఎవరికీ గాయాలు కాలేదు.. ఎవరూ చనిపోలేదు.”
హెలికాప్టర్ నుంచి డాలర్ల వర్షం కురుస్తుండటాన్ని గమనించిన వారంతా.. ప్లాస్టిక్ సంచుల్లో గంటల వ్యవధిలోనే వాటన్నింటినీ సేకరించారు. కొందరైతే.. గొడుగులు పట్టి మరీ డాలర్లను సేకరించారు. కజ్మా చెప్పిన దాని ప్రకారం సుమారు 4000 మంది ఈ డాలర్లను సేకరించారు.
https://www.instagram.com/reel/CyzNHwWu-Se/?utm_source=ig_web_copy_link