BigTV English

Strasbourg : డాన్స్ చేస్తూనే చనిపోయారు..!

Strasbourg : డాన్స్ చేస్తూనే చనిపోయారు..!

Strasbourg : అది ఫ్రాన్స్‌లోని స్ట్రాస్ బర్గ్ నగరం. 1518 జులై మొదటివారంలో ట్రఫీ ఓ మహిళ స్వల్ప అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు తమకు తెలిసిన వైద్యమేదో చేయగా.. కాస్త కుదరుకుంది.


‘తెల్లారాక.. డాక్టరు దగ్గరికి తీసుకెళ్దాంలే’ అనుకుంటూ కుటుంబ సభ్యులంతా తిని పడుకున్నారు. అయితే.. తెల్లారి లేచి చూసే సరికి ఆ మహిళ ఇంటి ముందు రోడ్డు మీద పూనకం వచ్చినట్లు డాన్స్ చేస్తూ కనిపించింది.

ఆ దారిన పోయేవారంతా ‘ఏదో గుడ్‌న్యూస్ ఉన్నట్టుంది’ అని నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తుండగానే.. ఆమె రొప్పు, ఆయాసంతో అక్కడే కుప్పకూలిపోయింది.


ఆ సాయంత్రానికి అదే వీధిలో మరో ముగ్గురు ఇలాగే రోడ్డెక్కి చిందులు తొక్కటం మొదలుపెట్టారు. కొన్ని గంటలకు వారూ కన్నుమూశారు. ఇదేంటో డాక్టర్లకు అంతుబట్టలేదు.

వారం గడిచేసరికి వందలమంది రోడ్డెక్కి రచ్చచేయటం మొదలుపెట్టారు. వారంతా ఏదో సమస్యతో ఇలా చేస్తున్నారని వైద్యులు అర్థం చేసుకున్నా.. అదేంటో కనిపెట్టలేకపోయారు.

డాన్స్ చేసే వారిని ముట్టుకోవటం వల్ల ఇది ఇతరులకూ వ్యాపిస్తుందనే పుకార్లు పుట్టటంతో జనం.. సొంత కుటుంబ సభ్యల దగ్గరికీ వెళ్లటానికి సాహసించలేకపోయారు.

మరోవైపు ఈ వార్త దేశమంతా పాకింది. సమీప ప్రాంతాలవారంతా ఇల్లూ వాకిళ్లూ వదిలి దూరప్రాంతాలకు పోవటం మొదలు పెట్టారు. గతంలో ప్లేగు వ్యాధి సృష్టించిన విలయంతో అటు ప్రభుత్వమూ అప్రమత్తమైంది.

అలా రోడ్లపై డాన్స్ చేసేవారినందరినీ బలవంతంగా మునిసిపాలిటీ అధికారులు తరలించి ఓ భవనంలో పెట్టారు. అయితే.. వారంతా గుంపులు గుంపులుగా చేరి మరింతగా డాన్స్ చేయటం, మరింత వేగంగా చనిపోవటం మొదలైంది.

ఇదేంటో తెలుసుకునే లోపే.. ఆగస్టు వచ్చేసింది. మొత్తానికి ఆగస్టు నెలాఖరు నాటికి ఇలా 400 మంది చనిపోయాక ఆ కేసుల సంఖ్య నెమ్మదించింది.

వైద్యులు, పరిశోధకులు దీనికి కారణాలు చెప్పలేకపోయారు గానీ.. సాధారణ జనం మాత్రం దీనిని ‘డాన్సింగ్ ప్లేగు’ అన్నారు.

అదేకాలంలో స్విట్జర్లాండ్, జర్మనీ, హాలాండ్‌‌లోనూ ఇలాంటి కేసులే బయటపడినా.. ఈ వ్యాధికి గల కారణాలు తెలియరాలేదు.

అయితే.. కలుషితమైన పిండితో చేసిన వంటకాలు తినటం వల్ల ఆ సమస్య వచ్చి ఉండొచ్చని తర్వాతి కాలంలో పరిశోధకులు ఒక అంచనాకు వచ్చినా అందుకు గల ఖచ్చితమైన కారణాలను మాత్రం నేటికీ కనిపెట్టలేకపోయారు.

Tags

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×