E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode November 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లోంచి వెళ్లిపోయిన పార్థు  

Nindu Noorella Saavasam Serial Today Episode November 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లోంచి వెళ్లిపోయిన పార్థు  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రామ్మూర్తి ఇంట్లో ఉన్న పార్థు. మంగళ తిట్టిన తిట్లు గుర్తు చేసుకుంటాడు. నేను ఎవరో నాకే తెలియదు. నేను ఇంకా ఇక్కడే ఉండి వీళ్లను ఇబ్బంది పెట్టడం కరెక్ట్‌ కాదు. నా గురించి నేనే తెలుసుకుంటాను అనుకుంటూ పార్థు ఇంట్లోంచి వెళ్లిపోతాడు. ఇంట్లోంచి వెళ్లిపోయిన పార్థు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడే చంభా కూరగాయలు తీసుకుని రోడ్డు మీద వెళ్తుంది.

పార్థు చంభాకు ఎదరుగా వెళ్తాడు. కూరగాయలు సర్దుకుంటూ వెళ్తున్న చంభా పార్థుకు వెళ్లి డాష్‌ ఇస్తుంది. తిరిగి కోపంగా కళ్లు కనిపించడం లేదా..? అంటూ పార్థును చూసి షాక్‌ అవుతుంది. చంభా వెంటనే కూరగాయల సంచి కింద పడేసి అక్కడి నుంచి పరుగెడుతుంది. పార్థు మాత్రం నన్ను చూసి ఎందుకు పరుగెడుతుంది. నేను ఆవిడకు తెలుసా..? అనుకుంటూ ఏవండి ఆగండి.. అంటూ చంభా వెనకాలే పరుగెడతాడు పార్థు.. ఏవండి మీరు ఎవరు..? నేను ఎవరో మీకు తెలుసా..? అనుకుంటూ వెళ్తుంటాడు. చంభా ఆగకుండా అలాగే పరుగెడుతుంది. కొద్దిదూరం వెళ్లాక చంభా చెట్ట చాటుకు వెళ్లగానే.. పార్థు ఆగిపోయి ఆవిడ ఎటువైపు వెళ్లింది. ఆవిడ ఎవరు నన్ను చూసి ఎందుకు పరుగెడుతున్నారు అనుకుంటూ వెళ్తాడు.

Advertisement

జాగింగ్‌కు వెళ్లి వచ్చిన అమర్‌. రాథోడ్‌ను పిలుస్తాడు. వైజయంతి మేడం లగేజీ పంపిచలేదా.. అని అడిగితే.. నిన్ననే మేడం డ్రైవర్‌తో పంపించామని రాథోడ్‌ చెప్పగానే.. ఏంటి మరి పార్థు ఫోటో అక్కడే ఉంది అని అడిగితే.. సారీ సార్‌ నేను హడావిడిలో తీసేయలేదు.. ఇప్పుడే తీస్తాను అంటూ రాథోడ్ పార్థు ఫోటో తీసేయబోతుంటే.. రామ్మూర్తి, మిస్సమ్మ పైనుంచి వస్తారు. అదేంటి రాథోడ్‌ ఆ ఫోటో అలా పట్టుకున్నావు అని అడిగితే.. ఇది మనోహరి భర్త పార్థు సార్‌ది వేరే చోట పెట్టాలని తీశాను అంటూ రాథోడ్‌ చెబితే.. అదేంటి తీసుకెళ్లి ఆవిడ రూంలోనే పెట్టొచ్చు కదా అంటాడు రామ్మూర్తి. లేదు సార్‌ ఇది వేరే చోటికి పంపించాలి అంటాడు రాథోడ్‌.

అప్పుడే మిస్సమ్మ నాన్న మీరు చెప్పాలనుకున్నది చెప్పండి మళ్లీ ఆయన ఆఫీసుకు వెళ్తారు అంటే.. ఏంటి మామయ్య ఏంటి విషయం అని అమర్‌ అడిగితే.. రామ్మూర్తి తాము తీర్థయాత్రల నుంచి తిరిగి వస్తున్నప్పుడు పార్థు దొరికిన విషయం చెప్తాడు. అతని వివరాలు కనుక్కుని వాళ్లింటికి పంపిస్తారా..? అని అడిగితే.. తప్పకుండా మామయ్య అంటూ రాథోడ్‌ నువ్వు మామయ్యగారి ఇంటికి వెళ్లి అతని ఫోటో తీసుకుని అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపించి నేను చెప్పానని చెప్పి ఎంక్వైరీ చేయమను.. నువ్వు వచ్చేటప్పుడు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చేయ్‌ అంటాడు అమర్‌. ఎందుకు తీసుకురావడమని రామ్మూర్తి అడిగితే అతని వల్ల మంగళ ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. అందుకనే డీటెయిల్స్‌ తెలిసే వరకు అతను ఇక్కడే ఉంటాడు అని అమర్‌ చెబితే..

Advertisement

వద్దులే బాబు ఇప్పటికే ఈ ఇంట్లో చాలా మంది ఉన్నారు మల్లీ ఇంకొకరు అంటే మీకు ఇబ్బంది అవుతుందేమో అంటూ రామ్మూర్తి చెప్తుంటే. ఏం కాదు మామయ్య మీరు పంపించండి అని అమర్‌ చెప్తుండగానే.. రామ్మూర్తికి మంగళ ఫోన్‌ చేస్తుంది. ఇదొకటి ఆత్రం ఆపుకోలేదు ప్రతి దానికి ఫోన్‌ చేస్తుంది అంటూ లిఫ్ట్‌ చేసి ఏంటే అని అడిగితే.. మంగళ ఆ అబ్బాయి ఇంట్లో లేడని చెప్తుంది. ఆ మాటతో రామ్మూర్తి బయటకు వెళ్లి ఫోన్‌ మాట్లాడతాడు. ఆ అబ్బాయి ఇంట్లో లేడని మంగళ చెప్పగానే.. రామ్మూర్తి షాక్‌ అవుతాడు.. నేను వస్తాను ఉండు అంటూ అమర్‌ వాళ్లు ఏమైందని అడిగితే.. ఏం లేదు నేను తర్వాత వచ్చి కలుస్తాను అంటూ రామ్మూర్తి వెళ్లిపోతాడు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? ప్రభా బుట్టలో పడింది.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode November 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు విషయంలో ఐశ్వర్య సక్సెస్ అవుతుందా..?   

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. భరత్ మాటతో షాక్.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Telugu TV Serials: వీక్లీ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు సీరియల్స్ అవుట్..!

Friday TV Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

బిగ్ బాస్ లో సుధీర్‌ను గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మి స్పెషల్ రిక్వెస్ట్!

మంగ్లీ వర్సెస్ ప్రభ.. ఫోక్ సాంగ్స్‌లో అసలు వార్ మొదలైందా?

Big Stories

Advertisement
×