US Strikes On Iran: టెహ్రాన్‌తో వాషింగ్టన్ జరుపుతున్న చర్చలు వేళ ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడి చేసింది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ఇరాన్‌పై కొత్త సైనిక చర్యను పరిశీలించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాపై ఒత్తిడి నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంది. \
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ.. టెహ్రాన్‌పై కొత్త సైనిక చర్యకు ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు పిలుపు ఇచ్చారు. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ అతి పెద్ద ద్వీసం ఖేష్మ్‌పై దాడి చేసింది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ మొదట ప్రస్తావించింది. ఐదు చోట్ల బాంబు దాడులు జరిగినట్టు అందులోని సారాంశం. ఈ దాడులు పరిమితంగా ఉన్నాయని, ఇరుదేశాల మధ్య పోరాటానికి పునః ప్రారంభించడం కాదని అమెరికాకు చెందిన ఓ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ కూడా హోర్ముజ్ జలసంధిలోని ఆ ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు వచ్చాయని పేర్కొంది. ఆ ద్వీపంలో వెంట వెంటనే ఐదు పేలుళ్లు వినిపించాయని, ఆకాశంలో రెండు విమానాలు ఎగరడం కొందరు స్థానికులు చూశారని పేర్కొంది. కొన్ని వారాల విరామం తర్వాత మళ్లీ ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం మొదలైనట్టు కనిపిస్తోంది.
అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై కొత్త సైనిక చర్యను పరిశీలించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు దౌత్యపరమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని చెబుతున్నారు. తిరిగి యుద్ధం జరిగే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చారు.
ALSO READ: రెండు హెలికాప్టర్లు అనూహ్యంగా ఢీ.. ఓ భారతీయుడు మృతి, నేపాల్‌లో దారుణమైన ఘటన
ఇరాన్‌తో యుద్ధం మేము చేసి గెలిచామన్నారు ట్రంప్. దీన్ని యుద్ధం అంటారో లేదో నాకు తెలియదని, ఎందుకంటే మేము నెలల తరబడి ఎలాంటి పోరాటం చేయలేదని సోమవారం మీడియాతో చెప్పారు. హోర్ముజ్ జలసంధి ముఖద్వారం వద్ద ఖేష్మ్‌లో పెద్ద భూగర్భ క్షిపణి, నేవీ స్థావరాలు ఉన్నాయి. ప్రధాన ఉప్పు నీటి శుద్ధి కర్మాగారం ఉంది. ఈ ద్వీపం దాడుల సమయంలో అమెరికా లక్ష్యంగా ఉన్న విషయం తెల్సిందే.