E-Paper
Advertisement

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. భారతీయ సంతతికి చెందిన నేతల జోరు, వారంతా డెమోక్రటిక్ సభ్యులు

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. భారతీయ సంతతికి చెందిన నేతల జోరు, వారంతా డెమోక్రటిక్ సభ్యులు
Advertisement

US Midterm Elections-2026: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో అధికార రిపబ్లికన్, విపక్ష డెమోక్రటిక్ పార్టీల తరపున భారతీయ సంతతికి చెందిన నేతలు సత్తా చాటారు. అనేక మంది యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఐదుగురు భారతీయ-అమెరికన్ నేతలు డెమోక్రటిక్ పార్టీ గెలిచి అక్కడ చట్ట సభలో అడుగు పెట్టనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భారత సంతతికి చెందినవారి ఆధిపత్యం క్రమంగా పెరుగుతోంది.

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీకి చావు దెబ్బ తగిలింది. అయిపోయిందని భావించిన డెమోక్రటిక్ పార్టీ తారాజువ్వ మాదిరిగా దూసుకొచ్చింది. నిత్యం వార్తల్లోకి నిలిచేందుకు ప్రయార్టీ ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్, అక్కడి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా ఆ పార్టీ నేతల కంచుకోటలు కుదేలు అయ్యాయి.

Advertisement

ఐదుగురు భారతి సంతతికి చెందిన రాజకీయ నాయకులు అమెరికా ప్రతినిధుల సభలో సీట్లు గెలుచుకున్నారు. వారిలో అమీష్ షా ఇంకా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. విజేతల్లో రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, సుహాస్ సుబ్రమణియం, పియా దండియా ఉన్నారు. 2024 ఎన్నికలలో భారత సంతతికి చెందిన ఆరుగురు సభకు ఎన్నికయ్యారు. ఈసారి సెనేట్‌కు ఏ భారతీయ – అమెరికన్ అభ్యర్థి పోటీ చేయలేదు. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఒహాయో నుండి పోటీ చేసి డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో ఓటమి పాలయ్యారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి 5 మంది భారతీయ సంతతికి చెందిన నేతలు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు.

1. అమీ బేరా.. భారత సంతతికి చెందిన రాజకీయ నేతల్లో యూఎస్ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పని చేసిన సభ్యుడు. ఆయన కాలిఫోర్నియాలోని 3వ కాంగ్రెస్ నియోజకవర్గం నుండి రిపబ్లికన్ అభ్యర్థి రాబ్ టకర్‌ను 23,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. అమీ బేరా వరుసగా ఎనిమిదో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. అమీ వృత్తి రీత్యా వైద్యుడు కాగా, 2013లో తొలిసారిగా ప్రతినిధుల సభలో అడుగుపెట్టారు.

Advertisement

2. ప్రమీలా జయపాల్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు. ఈమె రిపబ్లికన్ అభ్యర్థి నిరవ్ షెత్‌ను 1,52,000 ఓట్లకు పైగా తేడాతో ఓడించారు. వాషింగ్టన్‌లోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో వరుసగా ఆరోసారి విజయం సొంతం చేసుకున్నారు. ప్రమీల 2017 నుండి పార్లమెంట్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఈమె. చెన్నైలో జన్మించిన ప్రమీల.. ఆ తర్వాత ఇండోనేషియా, సింగపూర్‌లలో బాల్యం గడిచింది. 16 ఏళ్లకే అమెరికా వెళ్లిన ప్రమీలా, తొలుత వాల్‌స్ట్రీట్‌లో ఆర్థిక విశ్లేషకురాలిగా పని చేశారు. సమాజానికి సేవ చేయాలన్న తపనతో కార్పొరేట్‌ రంగాన్ని వీడి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

3. రో ఖన్నా, డెమోక్రటిక్ పార్టీ నుంచి ఆరోసారి గెలిపారు. కాలిఫోర్నియాలోని 17వ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రో ఖన్నా వరుసగా ఆరోసారి విజయం సాధించారు. ఆయన రిపబ్లికన్ అభ్యర్థి రితేష్ టాండన్‌ను 42 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఓడించారు. టాండన్ గతంలో 2020, 2022లో రో ఖన్నాపై పోటీ చేశారు. ఖన్నా.. 2017 నుండి యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. చైనా విధానాలు, సాంకేతికత, వాణిజ్యం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ALSO READ: అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. అధికార పార్టీ కంచుకోటలు బద్దలు, ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Related News

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. అధికార పార్టీ కంచుకోటలు బద్దలు, ట్రంప్ కీలక వ్యాఖ్యలు

మధ్యంతర ఎన్నికల వేళ.. ఇరాన్‌లోని ఖేష్మ ద్వీపంపై అమెరికా దాడులు, మళ్లీ ఏం జరిగింది?

రెండు హెలికాప్టర్లు అనూహ్యంగా ఢీ.. ఓ భారతీయుడు మృతి, నేపాల్‌లో దారుణమైన ఘటన

ఘోర విమాన ప్రమాదం.. రోడ్డుపై కూలిన తర్వాత ఎగిసిన మంటలు, ఫ్లోరిడాలో ఘటన

పుట్‌బాల్ గేమ్ తర్వాత.. స్టేడియంలో కాల్పులు కలకలం, అమెరికాలో షాకింగ్ ఘటన

జెన్-జీ నిరసనలు తీవ్రతరం.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో షాపుల లూటీ, జర్మనీలో హింసాత్మక పరిస్థితులు

ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నో మెజారిటీ.. హంగ్ ఏర్పడే ముప్పు?

Big Stories

Advertisement
×