Nepal: నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాలో హెలిప్యాడ్‌పై దిగేందుకు ప్రయత్నిస్తుండగా గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందాడు. మరో ఎన్నారై గాయపడ్డాడు. దీనికి సంబంధించి దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఘటన ఎలా జరిగింది?
నేపాల్ రాజధాని ఖాఠ్మండుకు 250 కిలోమీటర్ల దూరంలో ఘోరం జరిగింది. సోలుఖుంబు జిల్లాలో ఓ హెలిప్యాడ్‌పై దిగేందుకు ప్రయత్నిస్తుండగా రెండు హెలికాప్టర్లు ప్రయత్నిస్తున్న సమయంలో గాల్లోనే ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ భారత జాతీయుడు మరణించాడు. మరొకరు భారత సంతతికి చెందిన వ్యక్తి గాయపడ్డాడు. మృతుడు 47 ఏళ్ల వసంత్ కుమార్ గా గుర్తించారు.
గాయపడిన వ్యక్తి భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ పౌరుడు. అతడి వయస్సు 53 ఏళ్లు, పేరు శైలేష్ కిషన్ పటేల్. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ల రోటర్ బ్లేడ్లు ఒకదానికి మరొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో హెలికాప్టర్ల ఢీ కొట్టడంతో వాటికి సంబంధించి బ్లేడులు విరిగిపోయాయి. ఘటన సమయంలో అక్కడ చాలామంది ప్రయాణికులు ఉన్నారు, అక్కడి నుంచి వారంతా దూరంగా పరుగులు తీశారు. ఆ తర్వాత పరుగెత్తుకుని వచ్చిన పలువురు హెలికాప్టర్ లోని వ్యక్తులకు ఏమైనా జరిగిందా అని చూశారు.
ALSO READ: ఘోర విమాన ప్రమాదం.. రోడ్డుపై కూలిన తర్వాత ఎగిసిన మంటలు, ఫ్లోరిడాలో ఘటన
అప్పటికే ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురించి తెలియగానే మరొక హెలికాప్టరులో అధికారులు అక్కడికి చేరుకున్నారు. సోలుఖుంబు జిల్లా డీఎస్పీ నబిన్‌రాజ్ మాట్లాడారు. మృతదేహాన్ని హెలికాప్టర్‌లో లుక్లాకు తరలించినట్టు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని వైద్య చికిత్స కోసం వేరొక హెలికాప్టర్‌లో తరలించినట్టు వెల్లడించారు. నేపాల్ వ్యాప్తంగా పర్యాటకులను, పర్వతారోహకులను తరలించడానికి, సామాగ్రిని రవాణా చేయడం, అత్యవసర సహాయక చర్యలకు చిన్న హెలికాప్టర్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
BREAKING: Scary footage of the mid-air rotor strike.
Two helicopters collide near Everest while landing at Pheriche.
Fishtail Air and Air Dynasty — one Indian passenger killed, others injured.
What happened?#Nepal #HelicopterCrash pic.twitter.com/gOD4slKDbs
— Conflict Monitor (@ConflictM0nitor) November 3, 2026