E-Paper
Advertisement

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. అధికార పార్టీ కంచుకోటలు బద్దలు, ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. అధికార పార్టీ కంచుకోటలు బద్దలు,  ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Trump: అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్ సర్కార్ ఝలక్ తగిలింది. కీలక సీట్లలో అధికార రిపబ్లిక్‌ పార్టీకి షాకిచ్చారు డెమోక్రాట్లు. సెనెట్‌ స్థానాలు దక్కడంతో ఎగువసభలో డెమోక్రాట్లకు ఆధిపత్యం లభించింది. ఇదే జోరు కొనసాగితే ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిక్యం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా ఫలితాలపై అసహనం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు

ఇరాన్‌పై ట్రంప్ సర్కార్ యుద్ధం, కఠినమైన సుంకాల వ్యవస్థ, పెరిగిన ఖర్చులపై ఆందోళనల ప్రభావం ట్రంప్ సర్కార్‌పై స్పష్టంగా పడింది. ఫలితంగా అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్ సర్కార్ ఊహించని ఝలక్ తగిలింది. ట్రంప్ ఎంపిక చేసిన అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించారు. అధికార రిపబ్లిక్‌ పార్టీ చావు దెబ్బ కొట్టారు. ఫలితాలు చూసి కంగుతిన్న ట్రంప్, కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్‌ పేపర్‌లో తన పేరు ఉంటే ఓడిపోయే వాళ్లం కాదన్నారు.

అధికార పార్టీ కంచుకోటలు బద్దలు

Advertisement

స్వయంగా తాను బరిలోకి దిగితే రిపబ్లికన్‌ పార్టీ సునాయాశంగా విజయం సాధించేదని ట్రూత్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. వస్తున్న ఫలితాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. డెమోక్రాట్లతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. నార్త్ కరోలినా, ఒహాయో, అయోవా, టెక్సాస్, సౌత్ కరోలినా, కాన్సాస్‌లలో, డెమోక్రటిక్ అభ్యర్థులు విజయం సాధించారు. దశాబ్దాల రిపబ్లిక్ పార్టీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఈ ఫలితాలు ట్రంప్‌కు ఓటర్ల నుండి పెద్ద మందలింపుగా ఉన్నాయి. సంప్రదాయవాద రాష్ట్రాల్లోకి వెళ్లి రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నేను బ్యాలెట్‌లో ఉన్నట్లుగా భావించి ఓటు వేయాలని పదే పదే ఓటర్లను కోరారు.

సౌత్‌ కరోలినాలో దాదాపు మూడు దశాబ్దాల రిపబ్లికన్ల ఆధిపత్యానికి గండి పడి సెనెట్‌ సీటును ఈ పార్టీ కోల్పోయింది. సెనెట్ స్థానం నుంచి రిపబ్లికన్‌ అభ్యర్థి, దివంగత నేత లిండ్సే గ్రాహం సోదరి డార్లిన్‌ గ్రాహం పరాజయం పాలయ్యారు. ఆమెపై డెమోక్రటిక్‌ అభ్యర్థి ఆండ్రూస్‌ విజయం సాధించారు. 1998లో అక్కడి నుంచి డెమోక్రటిక్‌ నేత సెనెటర్‌గా ఎన్నికయ్యారు. టెక్సాస్‌లో కూడా మూడు దశాబ్దాల రిపబ్లికన్ల ఆధిపత్యానికి గండిపడింది. 1993 తర్వాత తొలిసారి డెమోక్రటిక్‌ నేత సెనెటర్‌గా గెలుపొందారు.

Advertisement

ALSO READ: మధ్యంతర ఎన్నికల వేళ.. ఇరాన్‌లోని ఖేష్మ ద్వీపంపై అమెరికా దాడులు, మళ్లీ ఏం జరిగింది?

ఈ ఫలితాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా రియాక్ట్ అయ్యారు. అమెరికా ప్రజలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ప్రజలను విభజించే రాజకీయాలను కాకుండా వారిని ఏకం చేసే రాజకీయాలు, పరిష్కారాలను అందించే నాయకులను కోరుకుంటున్నారని రాసుకొచ్చారు. ఒకప్పుడు గెలుపు అసాధ్యం అనుకున్న ప్రాంతాల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ట్రంప్ ప్రభుత్వానికి మరో రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ మన పని నడుం బిగించి, అధికారం ఉన్న ప్రతిచోటా మార్పులు తీసుకురావాలన్నారు. మరింత నష్టం జరగకుండా నివారించడం, భవిష్యత్తుకు పునాది వేయాలన్నారు. మధ్యంతర ఎన్నికలలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్‌పై నియంత్రణ కోల్పోతే కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. మిగిలిన పదవీ కాలం అంతా పరిపాలన, వ్యాపార వ్యవహారాలతో గడిచిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో అభిశంసనకు దారి తీయవచ్చని రాజకీయ విశ్లేషకుల మాట.

Related News

మధ్యంతర ఎన్నికల వేళ.. ఇరాన్‌లోని ఖేష్మ ద్వీపంపై అమెరికా దాడులు, మళ్లీ ఏం జరిగింది?

రెండు హెలికాప్టర్లు అనూహ్యంగా ఢీ.. ఓ భారతీయుడు మృతి, నేపాల్‌లో దారుణమైన ఘటన

ఘోర విమాన ప్రమాదం.. రోడ్డుపై కూలిన తర్వాత ఎగిసిన మంటలు, ఫ్లోరిడాలో ఘటన

పుట్‌బాల్ గేమ్ తర్వాత.. స్టేడియంలో కాల్పులు కలకలం, అమెరికాలో షాకింగ్ ఘటన

జెన్-జీ నిరసనలు తీవ్రతరం.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో షాపుల లూటీ, జర్మనీలో హింసాత్మక పరిస్థితులు

ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నో మెజారిటీ.. హంగ్ ఏర్పడే ముప్పు?

ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఖతార్, టర్కీల సీక్రెట్ గేమ్ నిజమేనా? షిన్ బెట్ విచారణలో తేలేది ఏంటి?

Big Stories

Advertisement
×