Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు డోనాల్డ్ ట్రంప్. అందుకు సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈసారి ట్రంప్ తన గెటప్ కూడా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ గెటప్ ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు అదే రోజు చేపట్టనున్నారు. 78 ఏళ్ల వయస్సులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారాయన. ఇప్పటివరకు ఈ వయస్సు వాళ్లు అధ్యక్ష పీఠాన్ని ఎక్కిన సందర్భం అమెరికా చరిత్రలో లేదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు తర్వాత ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నారు డోనాల్డ్ ట్రంప్. మంగళవారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌ను సందర్శించారు. అయితే ట్రంప్ లుక్‌ని చూసిన నిర్వాహకులు షాకయ్యారు. మంగళవారం సాయంత్రం గోల్ఫ్ క్లబ్‌లో స్పోర్ట్స్‌మన్ స్టయిల్‌లో కనిపించారు.
ట్రంప్ తన హెయిర్‌ను కంప్లీట్‌గా ట్రిమ్ చేసినట్టు కనిపించారు. అలాగే వైట్ గోల్ఫ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, రెడ్ టోపీ, బూట్లు ధరించి కనింపిచారు. వెరైటీ లుక్‌లో డోనాల్డ్‌ట్రంప్ కనిపించడం ఇదే తొలిసారి. ఆయనను ఈ విధంగా చూడడంతో ఆయనను తమ కెమెరాల్లో బంధించేందుకు పలువురు పోటీపడ్డారు. అయినా సెక్యూరిటీ వాళ్లు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు.
ALSO READ: క్యాన్సర్‌కు వ్యాక్సిన్.. ఉచితంగా సరఫరా చేస్తామన్న రష్యా!
స్థానికంగా గోల్ఫ్ ఆడే ప్రాంతంలో కొందరు దూరంగా నుంచి ఆయనను తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. ఆపై సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు ట్రంప్ న్యూలుక్ వీడియో వైరల్ అయ్యింది. ట్రంప్‌ను చూసిన స్థానికులు గట్టిగా కేకలు వేశారు. ట్రంప్ మాట్లాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ సెక్యూరిటీ అందుకు అంగీకరించలేదు.
ట్రంప్ హెయిర్ స్టయిల్‌పై రకరకాలుగా చర్చ పెట్టుకోవడం అమెరికన్ల వంతైంది. టోపీ పెట్టడం వల్లే న్యూలుక్ వచ్చిందని అంటున్నారు. ఈ లుక్ ద్వారా ట్రంప్ ట్రెండ్ సెట్ చేస్తారా లేదా అనేది చూడాలి.
Trump just unveiled a new hair style pic.twitter.com/OxWen3lUOM
— End Wokeness (@EndWokeness) December 18, 2024