BigTV English

Rashmika Mandanna: అప్పుడు దీపికా.. ఇప్పుడు రష్మిక.. కన్నడ బ్యూటీ ఖాతాలో క్రేజీ బాలీవుడ్ సీక్వెల్

Rashmika Mandanna: అప్పుడు దీపికా.. ఇప్పుడు రష్మిక.. కన్నడ బ్యూటీ ఖాతాలో క్రేజీ బాలీవుడ్ సీక్వెల్

Rashmika Mandanna: సౌత్ నుండి నార్త్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ సౌత్, నార్త్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ రెండు ఇండస్ట్రీల్లో రాణిస్తున్న వారు చాలా తక్కువమంది ఉంటారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి రష్మిక మందనా యాడ్ అయ్యింది. పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకునే రేంజ్‌లో రష్మిక పాపులారిటీ పెరిగిపోయింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా హిందీలో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే రష్మిక మందనా చేతిలో రెండు భారీ బడ్జెట్ హిందీ ప్రాజెక్ట్స్ ఉండగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరో క్రేజీ సీక్వెల్ కూడా యాడ్ అయినట్టు బీ టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


మరొక ఆఫర్

తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలోనే రష్మికకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. మామూలుగా తెలుగు సినిమాలు వదిలేసి బాలీవుడ్ ఆఫర్ల వెంట వెళ్లిన హీరోయిన్స్ దాదాపుగా అక్కడే సెటిల్ అయిపోతారు. కానీ రష్మిక అలా చేయలేదు. హిందీలో ‘యానిమల్’ లాంటి బ్లాక్‌బస్టర్ కొట్టిన తర్వాత మళ్లీ తెలుగుకు వచ్చి ‘పుష్ప 2’లో నటించింది. ‘పుష్ప 2’ మూవీ కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో హిట్ అవ్వడంతో తనకు మరోసారి పాన్ ఇండియా పాపులారిటీ దక్కింది. తెలుగు, హిందీని ఈజీగా బ్యాలెన్స్ చేస్తున్న సమయంలోనే రష్మిక మందనాకు మరో బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టింది.


Also Read: రికార్డ్ బ్రేకింగ్ డైరెక్టర్‌తో నయనతార సినిమా.. మళ్లీ ఫామ్‌లోకి రానుందా.?

అదే పాత్రలో

2012లో బాలీవుడ్‌లో విడుదలయిన ఎన్నో ఫీల్ గుడ్ చిత్రాల్లో ‘కాక్‌టెయిల్’ ఒకటి. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన ఈ మూవీ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా వచ్చి ఎన్నో ఏళ్లు అయినా కూడా దీని గురించి మాట్లాడుకునేవారు ఇంకా ఉన్నారు. ముఖ్యంగా ‘కాక్‌టెయిల్’లో దీపికా పదుకొనె క్యారెక్టర్ చాలామంది అమ్మాయిలకు కనెక్ట్ అయ్యింది. ఇప్పుడే అదే సినిమాకు సీక్వెల్, అలాంటి పాత్రలోనే రష్మిక మందనా నటించనుందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్‌లో సైఫ్ అలీ ఖాన్‌కు బదులుగా షాహిద్ కపూర్ నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఖాతాలో వేసుకున్న రష్మిక.. ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్‌లో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది.

రెండు భారీ ప్రాజెక్ట్స్

మాడోక్ ఫిల్మ్స్.. షాహిద్ కపూర్, రష్మిక మందనా (Rashmika Mandanna) కాంబినేషన్‌లో తెరకెక్కే ‘కాక్‌టెయిల్ 2’ను నిర్మించనుందని సమాచారం. ఇప్పటికే రష్మిక చేతిలో రెండు భారీ హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ‘ఛావ’. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ‘ఛావ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు బాలీవుడ్ హారర్ కామెడీ యూనివర్స్‌లో కూడా ఒక సినిమా చేయడానికి రష్మిక సైన్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×