Russia Cancer Vaccine | ప్రపంచంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి రష్యా శుభవార్త తెలిపింది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నామని రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. పైగా ఈ వ్యాక్సిన్ రష్యాలో ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని.. 2025 సంవత్సరం ప్రారంభంలోనే ఇది అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటనలో పేర్కొంది.
సోమవారం డిసెంబర్ 16 2024న రష్యా ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జెనెరల్ డైరెక్టర్ ఆండ్రే కాప్రిన్.. రష్యా టాస్ న్యూస్ ఏజెన్సీ (TASS) మాట్లాడుతూ.. తాము తయారు చేసిన ఎంఆర్‌ఎన్ఏ (mRNA) వ్యాక్సిన్ క్యాన్సర్ చికిత్సలో సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు. ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ ను నిరోధించడానికి కాకుండా.. ఇప్పటికే క్యాన్సర్ తో బాధపడేవారికి ఉపయోగపడుతుందని చెప్పారు.
Also Read: ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య విభేదాలు.. హెచ్ వన్‌బి వీసా పెట్టిన చిచ్చు..
2025 లో ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ వ్యాక్సిన్‌ని గమాలేయా నేషనల్ రీసెర్చ్ ఫర్ ఎపిడెమియోలజీ అండ్ మైక్రోబయోలాజీ సంస్థ తయారు చేసింది. సంస్థ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్ బర్గ్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ క్లినకల్ ట్రయల్స్ లో ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. క్యాన్సర్ ట్యూమర్లను, దాని మెటాస్టేసెస్‌లను వృద్ధి చెందకుండా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా నిరోధిస్తోంది.
కొన్ని నెలల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ విషయాన్ని తెలిపారు. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స కోసం త్వరలోనే వ్యాక్సిన్ తీసుకురాబోతున్నారని.. ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. “క్యాన్సర్ వ్యాక్సిన్స్ తయారీలో చాలా వేగంగా పరిశోధనలు జరుపుతున్నాం. మంచి ఫలితాలు కూడా చూస్తున్నాం. ఈ వ్యాక్సిన్స్.. న్యూ జెనెరేషన్ ఇమ్యూనో మాడులేటరీ డ్రగ్స్ ఉపయోగించి తయారు చేయడం జరుగుతోంది”, అని ఫిబ్రవరిలో పుతిన్ అన్నారు.
అయితే ఈ వ్యాక్సిన్ ఎటువంటి క్యాన్సర్లకు చికిత్స కోసం పనిచేస్తుందనేది రష్యా శాస్త్రవేత్తలు స్పష్టం చేయలేదు. రష్యాతో పాటు అభివృద్ధి చెందిన మిగతా దేశాలు కూడా క్యాన్సర్ చికిత్స కోసం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటన్ ప్రభుత్వం.. ఒక జర్మనీ కంపెనీ బయోఎన్‌టెక్ (BioNTech) తో కలిసి క్యాన్సర్ చికిత్స కోసం వ్యాక్సిన్ల ప్రయోగాలు చేస్తోందని న్యూస్‌వీక్ మీడియా తెలిపింది.
క్యాన్సర్ తయారీలో ఏఐ ఉపయోగం?
రష్యా గమాలేయా నేషనల్ రీసెర్చ్ ఫర్ ఎపిడెమియోలజీ అండ్ మైక్రోబయోలాజీ సంస్థ డైరెక్టర్ గింట్స్‌బర్గ్ మాట్లాడుతూ.. ” వ్యాక్సిన్ తయారీ దశలో రోగికి ఉన్న క్యాన్సర్‌ని బట్టి దాని ట్యూమర్లను అదుపు చేయడానికి కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్స్ వినియోగించి వ్యాధికి తగట్టు వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. పాత విధానాల్లో పరిశోధనలు చేయాలంటే మ్యాట్రిక్స్, మెథమేటికస్ ఉపయోగించాలి. దాంట్లో సమస్య ఎక్కడుంది, దాని మూలం ఏంటి, దాని పరిణామం ఏంటి? అనేవి తెలుసుకొనేందకు నెలలు, సంవత్సరాలు పడుతోంది. అందుకే ఆ లెక్కలన్నీ ఏఐ ఉపయోగించి త్వరగానే పరిష్కరించాం. నెలల వ్యవధి పట్టే లెక్కలు గంట, అరగంటలో పూర్తి చేశాం. ఈ ప్రక్రియలో ఇవాన్ని కోవ్ ఇన్‌స్టిట్యూట్ సాయం తీసుకున్నాం” అని చెప్పారు.
మరోవైపు మోడెర్నా అండ్ మెర్క్ ఫార్మా కంపెనీ కూడా ప్రాణాంతక స్కిన్ క్యాన్సర్ మెలానోమాకు వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియలో ఉంది. అయితే ఆ పరిశోధనలు పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే.. స్కిన్ క్యాన్సర్ వ్యాధి మూడు సంవత్సరాలు నయమవుతుందన్నారు.