Bigg Boss Gautham Krishna : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గత ఆదివారంతో ఎపిసోడ్ పూర్తి అయ్యింది. కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నరప్ తో సరిపెట్టుకున్నారు. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తన యాట్టిట్యూడ్ తో అందరి మనసును గెలుచుకున్నాడు. సీజన్ 7లో ట్రోలింగ్ కి గురైన గౌతమ్ ఇప్పుడు అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. గౌతమ్ కు ఉన్న ఫైర్ ను చూసి అతను విన్నర్ అవుతాడని అందరు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ తెలుగోడిని కాకుండా కన్నడ బ్యాచ్ కె పట్టం కట్టింది. తాజాగా గౌతమ్ ఓ ఇంటర్వ్యూ లో సంచలన విషయాలను పంచుకున్నాడు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
తాజాగా ఇంటర్వ్యూలో గౌతమ్ ఫైనల్ ఎపిసోడ్ గురించి, రన్నరప్ గా నిలవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ ఫైనల్ వరకు చేరుకున్నాడంటే అందుకు కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్ మణికంఠ అని ప్రచారం జరుగుతోంది. దీనిపై గౌతమ్ స్పందిస్తూ మణికంఠ నన్ను ఒక్క వారంలో సేవ్ చేశాడు. మిగిలిన అన్ని వారాలు స్వయంకృషితో, కష్టపడి గేమ్ ఆడి ఈ స్థాయికి చేరుకున్నా అని గౌతమ్ తెలిపారు.. నేను ఏమి చెయ్యకుండానే గౌతమ్ ఫైనల్ వరకు వెళ్ళడు కదా అని చెప్తాడు. అయితే నిఖిల్ ని విజేతగా ప్రకటించిన వెంటనేఅతడికి కంగ్రాట్స్ చెప్పా. కానీ ఫైనల్ ఎపిసోడ్ లో అది చూపించలేదు. భవిష్యత్తులో నేను చరిత్ర సృష్టించే స్థాయికి ఎదుగుతానని నాగార్జున గారు అభినందించారు. అది కూడా చూపించలేదు.. ఫైనల్ ఎపిసోడ్ లో కొన్ని చూపించకుండా కట్ చేశారనే నిజాన్ని బయట పెట్టాడు.
గతంలో నన్ను ట్రోల్ చేసిన వారే ఈ సీజన్ లో మెచ్చుకోవడం సంతోషంగా అనిపించింది అని గౌతమ్ తెలిపారు.. ఫైనల్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గారు గెస్ట్ గా రావడం సంతోషంగా అనిపించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అంటే నాకు అమితమైన ఇష్టం. ఫినాలేలో ఆఫ్ ది రికార్డ్ లో ఒక సంఘటన జరిగింది. నేను రన్నర్ గా గెలిచినప్పుడు రామ్ చరణ్ నాకు కంగ్రాట్స్ చెప్పారు. అలాగే చరణ్ అన్న నా దగ్గరకి వచ్చి.. గౌతమ్ మా అమ్మ నీకు పెద్ద ఫ్యాన్. ప్రతి రోజు ఆమె బిగ్ బాస్ చూస్తుంది. నేను షూటింగ్ నుంచి రాగానే నీ గురించి చెబుతూ ఉంటుంది.. ఫైనల్ లో కూడా నువ్వే విన్నర్ గట్టిగా అనుకుంది. కొంచెంలో మిస్ అయ్యింది. దాంతో రన్నర్ గా నిలిచావు. అయినా ఏం పర్వాలేదు అంటూ రామ్ చరణ్ అన్న ఓదార్చినట్లు గౌతమ్ తెలిపాడు. ఇక త్వరలోనే మెగా ఫ్యామిలీని కలవబోతున్నా అని చెప్పాడు. గౌతమ్ కు సినిమాలంటే పిచ్చి, రామ్ చరణ్ కు గౌతమ్ బాగా నచ్చాడు. గతంలో చిరంజీవి దివికి తన సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడు. మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ అలాంటి మాట ఇచ్చారేమో మెగా హీరోల సినిమాలో ఛాన్స్ ఇస్తాడేమో అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. బిగ్ బాస్ విన్నర్ అవ్వక పోయిన నిఖిల్ కన్నా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్నావు. ఇక మెగా మూవీ ఛాన్స్ వస్తే నీ పంట పండినట్లే అని గౌతమ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా గౌతమ్ మెగా ఫ్యామిలీని కలిసిన తర్వాత ఒక క్లారిటి అయితే వస్తుంది.. అప్పటివరకు వెయిట్ చెయ్యాల్సిందే..