Elon Musk : అమెరికాలో రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్లు అనర్హతకు గురవుతారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఎవరు అనే విషయంపై.. ప్రపంచ కుబేరుడు, ట్రంప్ కు సీనియర్ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో మస్క్ అనేక అంశాల్లో మాట్లాడే మాటలు ఆసక్తికరంగా ఉంటుంటాయి. అతను ఏం మాట్లాడినా, చెప్పినా.. ఆ విషయంపై గట్టిగానే చర్యలు జరుగుతుంటాయి.
తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాలకు విస్తరిస్తూ.. లక్షల కోట్లకు అధిపతిగా మారిన ఎలాన్ మస్క్.. ఎన్నికల్లో ట్రంప్ పాల్గొంటున్నప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామిగా మారి అనేక అంశాలను దగ్గరిగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఎప్పటికైనా అత్యుత్తమంగా ప్రభుత్వంలో పని చేస్తున్న మన ఉపాధ్యక్షుడే.. మనకు కాబోయే అధ్యక్షుడు అంటూ వ్యాఖ్యానించారు. దాంతో.. జేడీ వాన్సన్ పనితీరుపై, ఆయన రాజకీయ కెరీర్ లో అందుకోబోయే అత్యున్నత పదవిపై మస్క్ తన అభిప్రాయాన్ని ఎలాంటి సంకోచాలు లేకుండా వెల్లడించినట్లైంది.
40 ఏళ్ల జేడీ వాన్స్.. అమెరికా చరిత్రలో మూడవ అతి పిన్న వయస్కుడైన ఉపాధ్యక్షుడిగా గుర్తింపు సాధించారు. ఈయన గతంలో ఒహియో నుంచి సెనేటర్‌గా ఎన్నికైన వాన్సన్.. రచయితగా, న్యాయవాదిగా వివిధ వృత్తుల్లో కొనసాగారు. వాస్తవానికి జేడీ వాన్స్ ఒకప్పుడు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించే వర్గంలో ఉండే వాడు. కానీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ట్రంప్ వర్గానికి దగ్గరయ్యారు. ఆ తర్వాత అతను ట్రంప్ నకు అతిపెద్ద మద్ధతుదారుగా మారిపోయారు. ప్రస్తుతం ఉపాధ్యాక్షుడిగా ఉన్నప్పటికీ.. జేడీ వాన్స్ అమెరికా ప్రభుత్వ యంత్రాగంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అందుకే.. అతను మస్క్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించాడు.
కాగా.. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ (Usha Chilukuri Vance) భారతీయ మూలాలున్న అమెరికన్. ఆమె తల్లిదండ్రులు అమెరికా వెళ్లి న్యాయవాద వృత్తిలో ప్రముఖ స్థానానికి ఎదిగారు. ఆమె యేల్ లా స్కూల్ (Yale Law School)లో విద్యనభ్యసించారు. అక్కడే అమెకు జేడీ వాన్స్ తో పరిచయం ఏర్పడింది. అతికాస్తా పెళ్లి వరకు వెళ్లింది. ఉషా-జేడీ వాన్స్ కు ఇద్దరు పిల్లలున్నారు. ఉషా భారతీయ కుటుంబ మూలాల కారణంగా జేడీ వాన్స్ కు కూడా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఇక్కడి విలువలపై అవగాహన ఉంది అంటుంటారు. ఈ కారణంగానే.. మొన్నటి ఎన్నికల్లో భారతీయులు.. వాన్స్ కు, ట్రంప్ నకు మంచి మద్ధతు అందించారు.