BigTV English

SRH Team: కావ్య పాపకు షాక్.. SRH లో నలుగురు ప్లేయర్లకు గాయాలు?

SRH Team: కావ్య పాపకు షాక్.. SRH లో నలుగురు ప్లేయర్లకు గాయాలు?

SRH Team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. ఈ 18వ సీజన్ ప్రారంభానికి మరో 21 రోజులు మాత్రమే సమయం ఉంది. 65 రోజులపాటు జరిగే ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 13 వేదికలలో ఈ మెగా లీగ్ నిర్వహించబడుతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చ్ 22న డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ కలకత్తా హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది.


 

ఇక రెండవ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య మార్చి 23న జరుగుతుంది. ఈ మ్యాచ్ సన్రైజర్స్ సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. గత సంవత్సరం ఐపీఎల్ లో సన్రైజర్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. గత మూడు సంవత్సరాలుగా ఎదురైన వైఫల్యాలను అధిగమించి వరుస విజయాలతో ఫైనల్ వరకు దూసుకొచ్చింది. కానీ ఆఖరిపోరులో కలకత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఇక ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది ఆరెంజ్ ఆర్మీ.


కానీ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ కి దూరమయ్యాడు. నితీష్ ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అతడు ఐపిఎల్ 2025 సీజన్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పలు కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాడు బ్రైడెన్ కార్స్ కూడా కాలిగాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇతడు కూడా ఐపీఎల్ కి దూరం కానున్నట్లు సమాచారం.

బ్రైడెన్ కార్స్ ని ఎస్.ఆర్.హెచ్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు అతడు గాయం నుంచి కోలుకునే అవకాశాలు అనుమానాస్పదంగా మారాయి. ఇక మరో ప్లేయర్ జీసస్ అన్సారి కూడా గాయం కారణంగా ఐపీఎల్ కి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాస్త ఊరటను కలిగించే విషయం ఏంటంటే.. గాయంతో బాధపడుతున్న హైదరాబాద్ జట్టు స్టార్ ప్లేయర్ ప్యాట్ కమీన్స్ ఎట్టకేలకు కోలుకొని.. ఈ సీజన్ కి అందుబాటులోకి వస్తానని పేర్కొన్నాడు.

అంతేకాదు త్వరలో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిపాడు. కమిన్స్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే అతడు కోలుకుంటున్నాడు. చీలమండ గాయం తగ్గిందని.. త్వరలోనే బౌలింగ్ ప్రాక్టీస్ మొదలు పెడతానని తెలిపాడు. 2024 మినీ వేలంలో కమీన్స్ ని హైదరాబాద్ జట్టు 20.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ ధరకు తగ్గట్టు న్యాయం చేశాడు కామీన్స్.

 

దీంతో 2025 మెగా వేళానికి ముందు అతడిని 18 కోట్లకు హైదరాబాద్ మేనేజ్మెంట్ రిటైన్ చేసుకుంది. ఇక గత సంవత్సరం చివరి మెట్టుపై బోల్తాపడడంతో.. ఈసారి అలాంటి తప్పు చేయకుండా పట్టుదలతో కప్ సాగించాలని భావిస్తుంది ఆరెంజ్ ఆర్మీ. కానీ ఈ గాయాల బెడద వెంటాడుతుండడంతో హైదరాబాద్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీజన్ ప్రారంభంలోపు వీరంతా గాయాలనుంచి కోలుకొని జట్టులో చేరాలని కోరుకుంటున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×