Bhagya Shri Borse.. ప్రముఖ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagya Shri Borse) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇటీవల రవితేజ(Raviteja ) హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ (Mr.Bachchan ) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. ఈమెకు మాత్రం ఆఫర్లు వరుసగా తలుపు తడుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ కి ముందే కొన్ని సినిమాలు సైన్ చేసినప్పటికీ ,ఈ సినిమా ఫ్లాప్ ఎక్కడ తన కెరియర్ పై ఎఫెక్ట్ చూపిస్తుందో అని భయపడింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈమె గ్లామర్, లుక్స్ చూసి ఈమెకు ఆఫర్లు వరుసగా వచ్చి పడుతున్నాయి.
వరుస సినిమాలలో అవకాశం..
ఇక అందులో భాగంగానే ఏకంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఉండటంతో.. అమ్మడి పంట పండింది అని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం రామ్ పోతినేని (Ram Pothineni) సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె.. దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) తో ‘కాంత’, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో ‘కింగ్ డమ్’ వంటి చిత్రాలలో నటిస్తోంది. ఇక ఇవే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే.. భాగ్యశ్రీ బోర్సేకి రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబినేషన్లో ఒక సినిమా త్వరలో అనౌన్స్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ లుక్ టెస్ట్ జరగగా.. అందులో ప్రముఖంగా భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది.
Samantha: విజయ్ దళపతి హీరోయిన్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన సామ్.. అందులో ఏముందంటే..?
ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబో మూవీలో అవకాశం..
ఈ మధ్యకాలంలో యంగ్ డైరెక్టర్లు అంతా కూడా కొత్త హీరోయిన్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎంతోమంది కొత్త హీరోయిన్లను ఈ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్క్రీన్ టెస్ట్ చేయగా.. వారిలో భాగ్యశ్రీ సెట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమెను కన్ఫర్మ్ చేయడానికి ప్రశాంత్ వర్మ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే భాగ్యశ్రీ కూడా టాలీవుడ్ లో సెటిల్ అవ్వడమే కాకుండా సీనియర్ స్టార్ హీరోయిన్స్ రేంజిలో తన కెరీర్ ను కొనసాగించడం ఖాయమని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబోలో మూవీ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.. మొత్తానికి అయితే భాగ్యశ్రీ బోర్సే కి ఇప్పుడు అవకాశాలు వరుసగా తలుపుతడుతున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటే.. ఇండస్ట్రీలో కెరియర్ సుదీర్ఘకాలం పాటు కొనసాగించడానికి వీలుంటుందని, లేకపోతే వరుస డిజాస్టర్ లతో సతమతమవ్వాల్సి ఉంటుందని ఫ్యాన్స్ కూడా సలహాలు ఇస్తున్నారు. మరి ఏ మేరకు భాగ్యశ్రీ బోర్సే తన సినిమా కథల ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.