BigTV English

Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ పై ఎలాన్ మస్క్ కీలక ప్రకటన..ఆ సేవలు ఆలస్యం ఎందుకంటే?

Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ పై ఎలాన్ మస్క్ కీలక ప్రకటన..ఆ సేవలు ఆలస్యం ఎందుకంటే?

Twitter Blue Tick : ట్విటర్‌ బ్లూ టిక్‌ చందా సేవల మరింత ఆలస్యం కానున్నాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. నకిలీ ఖాతాలను నియంత్రించిన తర్వాతే బ్లూ టిక్ సేవల్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అలాగే సంస్థలకు ఇచ్చే వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ రంగు మార్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యక్తిగత ఖాతాదారులకు, సంస్థల ఖాతాలకు తేడా ఉండేలా చూస్తామని ప్రకటించారు.


నవంబర్ 29 నుంచి ట్విటర్‌ బ్లూ టిక్ సేవలు తిరిగి ప్రారంభిస్తామని మస్క్‌ ఇటీవల ప్రకటించారు. ఖాతాదారుల వివరాల తనిఖీ అనంతరమే బ్లూ టిక్‌ ఇస్తామని వెల్లడించారు. పలువురు ప్రముఖుల పేరిట నకిలీ ఖాతాలు ఉండటంతో కొద్ది రోజులుగా ఈ సేవలను ట్విటర్‌ నిలిపివేసింది.

అక్టోబర్ 27న ఎలాన్ మస్క్‌ చేతికి ట్విటర్‌ రాకముందు.. ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీ తారలు సెలబ్రిటీల ఖాతా వివరాలను తనిఖీ చేశాకే బ్లూ టిక్‌ ఇచ్చేవారు. నవంబర్ 6న బ్లూటిక్‌ సేవలకు నెలకు 8 డాలర్ల ఫీజు ప్రకటించారు. ఎలాంటి తనిఖీలు చేపట్టకుండా బ్లూ టిక్ ఇచ్చేశారు. దీంతో నకిలీ ఖాతాలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి ఖాతాలపై ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ట్విట్టర్ బ్లూ టిక్ సేవలను నిలిపివేశారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×