E-Paper
Advertisement

Epstein Files: 13 ఏళ్ల అమ్మాయితో ట్రంప్.. బిల్ గేట్స్‌కు లైంగిక వ్యాధి? ఎప్‌స్టీన్ మెయిల్స్‌లో షాకింగ్ నిజాలు!

Epstein Files: 13 ఏళ్ల అమ్మాయితో ట్రంప్.. బిల్ గేట్స్‌కు లైంగిక వ్యాధి? ఎప్‌స్టీన్ మెయిల్స్‌లో షాకింగ్ నిజాలు!
Advertisement

అమెరికా వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన ఫైళ్లు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవల బయటకు వచ్చిన డాక్యుమెంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌పై వచ్చిన ఆరోపణలు రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక కుంభకోణం కేసులో కొత్త ఫైళ్లు బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో ఈ డాక్యుమెంట్లను ఉంచడం, ఆపై వెంటనే తొలగించి మళ్లీ ప్రత్యక్షం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఫైళ్లలో ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,  బిలియనీర్ బిల్ గేట్స్‌లకు సంబంధించిన అంశాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి.

Advertisement

ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు..

తాజాగా బయటపడిన డాక్యుమెంట్ల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ గతంలో ఒక 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేవలం లైంగిక వేధింపులే కాకుండా, ఒక నవజాత శిశువు హత్య కేసులో కూడా ట్రంప్ ప్రమేయం ఉందనే సంచలన విషయాలు ఈ ఫైళ్లలో ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, ఈ ఆరోపణలపై వైట్‌హౌస్ తక్షణం స్పందించింది. ట్రంప్‌పై వచ్చినవన్నీ అవాస్తవాలని, ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవన్నీ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

మరోవైపు, టెక్ దిగ్గజం బిల్ గేట్స్ చుట్టూ కూడా వివాదాలు ముసురుకుంటున్నాయి. ఎప్‌స్టీన్ తన సహచరులకు పంపిన కొన్ని పాత ఈమెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. రష్యన్ యువతులతో గడిపిన సమయంలో గేట్స్‌కు ఒక లైంగిక వ్యాధి (Sexual Disease) సోకిందని ఎప్‌స్టీన్ ఆ మెయిల్స్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, తన అనారోగ్యం గురించి భార్య మెలిందాకు చెప్పకుండా, ఆమెకు యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి బిల్ గేట్స్ ప్రయత్నించారని కూడా ఆ ఫైల్స్ వెల్లడిస్తున్నాయి.

ఖండించిన బిల్ గేట్స్

ఈ ఆరోపణలను బిల్ గేట్స్ తీవ్రంగా ఖండించారు. ఎప్‌స్టీన్ తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ అబద్ధపు కథనాలను ప్రచారం చేశాడని ఆయన ప్రతినిధులు పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌తో గతంలో ఉన్న పరిచయాన్ని అడ్డు పెట్టుకుని తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇవన్నీ సృష్టించినవి అని గేట్స్ కొట్టిపారేశారు.

ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో పెను తుపానును సృష్టించింది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ ఈ కేసు వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

ALSO READ: Ishan Kishan Century: ఒకే ఓవర్‌లో 4, 4, 4, 6, 4, 6…42 బంతుల్లోనే ఇషాన్ కిష‌న్‌ సెంచ‌రీ, న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×